చిరు- బాబీ మూవీ టైటిల్ ఫ్యాన్స్‌కి నచ్చిందా?
డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో పవర్ ఫుల్ స్టోరీగా సాగే ఈ మూవీలో చిరుకు జోడీగా ప్రియమణి నటిస్తుండగా, కూతురు పాత్రలో కృతిశెట్టి నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.;
ఈ మధ్య మూవీ టైటిల్స్ చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఏ డైరెక్టర్ ఎలాంటి టైటిల్‌తో వస్తాడో అని ఇప్పుడు అభిమానులు చాలా వరకు తీవ్ర ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. కొంత మంది డైరెక్టర్స్ కథకు తగ్గట్టుగా విభిన్నమైన టైటిల్స్ పెట్టినా అవి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని సొంతం చేసుకుంటుండటంతో ఫ్యాన్స్ ఓకే అంటున్నారు కానీ చాలా వరకు ఫ్యాన్స్‌కి చిత్రమైన టైటిల్స్ పెద్దగా నచ్చడం లేదు. కానీ కొంత మంది ఫ్యాన్స్ మాత్రం సినిమా బజ్, డైరెక్టర్‌కున్న క్రేజ్‌ని బట్టి ఎలాంటి విచిత్రమైన టైటిల్ పెట్టినా ఓకే పాస్ ఇట్ అంటున్నారు.
కొంత మంది డైరెక్టర్లు చెప్పే టైటిల్స్‌కి మాత్రం షాక్ అవుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది చిరు- బాబి కాంబినేషన్‌లో రానున్న మూవీ. ఈ సంక్రాంతికి మెగాస్టార్ అనిల్ రావిపూడితో కలిసి చేసిన `మన శంకరవరప్రసాద్‌గారు`తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. జనవరి 12న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుని రూ.300 కోట్లకు పైనే రాబట్టి స్టిల్ అదే జోష్‌తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.
కొంత విరామం తరువాత చిరుకు సాలీడ్ బ్లాక్ బస్టర్ పడటంతో ఈ సారి దానికి మించి అన్నట్టుగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. `విశ్వంభర` రిలీజ్‌కు రెడీ అవుతున్నా చిరు ఫుల్ కాన్సన్‌ట్రేషన్ మాత్రం బాబి సినిమాపైనే ఉంది. గతంలో బాబితో కలిసి `వాల్తేరు వీయ్య` మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న చిరు మరోసారి తనతో కలిసి ఓ భారీ యాక్షన్ డ్రామాకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. దళపతి విజయ్‌తో `జన నాయగన్` మూవీని నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించబోతోంది.
డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో పవర్ ఫుల్ స్టోరీగా సాగే ఈ మూవీలో చిరుకు జోడీగా ప్రియమణి నటిస్తుండగా, కూతురు పాత్రలో కృతిశెట్టి నటిస్తోందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీ కోసం తాజాగా ఓ టైటిల్ ని ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన టైటిల్ నెట్టింట చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్‌లో చర్చకు తెరలేపింది. ఈ సినిమా కోసం `కాకా` లేదా `కాకాజీ` అనే టైటిల్‌ని ఫైనల్ చేయాలని దర్శకుడు బాబి ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం టీమ్ దుబాయ్‌లో ఉంది. అక్కడే స్టోరీ సిట్టింగ్స్, స్క్రిప్ట్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ మూవీకి టైటిల్‌ని ఫైనల్ చేయబోతున్నారంటూ `కాకా` లేదా `కాకాజీ` అనే టైటిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ టైటిల్స్‌పై అభిమానులు పెదవి విరుస్తున్నారు. `కాకా` బాగుందని కొంత మంది కామెంట్ చేస్తుంటే మరి కొంత మంది `కాకా` అనగానే ప్రభాస్ మున్నా మూవీలోని క్యారెక్టర్ గుర్తొస్తోందని, ఏమీ బాగాలేదని విమర్శలు చేస్తున్నారు. మరి కొంత మందేమో కాకాజీ ఏంజీ తాతాజీ లాగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి కొంత మందేమో టైటిల్ చాలా వరస్ట్‌గా ఉందని, మీకు వేరే టైటిల్స్ ఏవీ దొరకడం లేదా అని ఫైర్ అవుతున్నారు. మరి ఫ్యాన్స్ విమర్శల నేపథ్యంలో చిరు మూవీ టైటిల్ కోసం వేరే పేరుని తెరపైకి తీసుకొస్తారా? లేక స్టోరీ డిమాండ్ చేస్తోంది కాబట్టి `కాకా` టైటిల్ ఫైనల్ అంటారా? అన్నది వేచి చూడాల్సిందే.