క‌ల్లోలం కొన‌సాగుతున్నా లేడీ సూప‌ర్ స్టార్ గ‌ట్స్

Update: 2021-04-27 13:30 GMT
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా ద‌రువు శివ తెర‌కెక్కిస్తున్న అన్నాథే షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో సాగుతోంది. ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్ తో అన్ని షూటింగుల్ని బంద్ చేస్తుంటే 70 వ‌య‌సులో ర‌జ‌నీకాంత్ ఎంతో ధైర్యంగా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటుండ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార హైద‌రాబాద్ విమానాశ్ర‌యంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఇంత‌టి క్రైసిస్ కి త‌ల‌వొంచ‌క `అన్నాథే` షూటింగ్ కోసం న‌య‌న్ విచ్చేయ‌డం అభిమానుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్ర‌స్తుతం కోవిడ్ నియ‌మ‌నిబంధ‌న‌ల్ని పాటిస్తూనే ఇరువురు సూప‌ర్ స్టార్లు ఆన్ లొకేష‌న్ యాక్ట్ చేయాల్సి ఉంది.

అన్నాతే చిత్రం అన్నా చెల్లెళ్ల‌ మధ్య అనుబంధం నేప‌థ్యంలోని సినిమా. కుటుంబ బంధాల‌ చుట్టూ తిరుగుతుంది. ఇందులో కీర్తి సురేష్ ర‌జ‌నీకి చెల్లెలుగా క‌నిపించ‌నున్నారు. విశ్వాసం సినిమాతో  అజిత్ కుమార్ - నయనతార జోడీకి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన శివ ప్ర‌స్తుతం ర‌జ‌నీ-న‌య‌న్ కి మంచి హిట్టిస్తార‌నే అభిమానులు న‌మ్ముతున్నారు.

అన్నాథేను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. రోబో- పేటా తరువాత రజనీకాంత్ తో ఈ సంస్థ నుంచి మూడవ సినిమా ఇది. ఈ చిత్రంలో ఖుష్బు సుందర్- మీనా- కీర్తి సురేష్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇతర నటుల పాత్రలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జగపతి బాబు- ప్రకాష్ రాజ్- సూరి- సతీష్ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Tags:    

Similar News