• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ డీల్స్ కు ఒప్పుకోకుండా...

ఆ డీల్స్ కు ఒప్పుకోకుండా 'జాతి రత్నాలు'ను కాపాడారుః నవీన్ పొలిశెట్టి

By - Tupaki Desk
Update: 2021-03-08 03:33 GMT
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నవీన్‌ పొలిశెట్టి మొదటి సినిమాతోనే ట్యాలెంట్‌ ఉన్న కుర్రాడు అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈయన జాతి రత్నాలు సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో నవీన్ పొలిశెట్టి జోష్‌ అతడు షో ల్లో చేస్తున్న సందడి చూసి భవిష్యత్తులో మంచి స్టార్‌ అవుతాడంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జాతి రత్నాలు ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ఏజెంట్‌ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో ఈ ప్రయాణం మొదలైంది. ఇప్పుడు జాతి రత్నాల వరకు వచ్చింది. ప్రభాస్‌ అన్న వల్ల డార్లింగ్ రత్నాలుగా.. విజయ్ దేవరకొండ వల్ల రౌడీ రత్నాలుగా ఈ సినిమా మారిపోయింది. ఎక్కడో యూట్యూబ్‌ వీడియోలు చేసుకుంటూ ఉండే వాళ్లం ఇలా మీముందుకు నాగీ.. స్వప్న.. ప్రియాంక గారు తీసుకు వచ్చారు. వారే ఈ సినిమాకు అసలైన రత్నాలు. హీరో అవ్వాలని వచ్చా కాని ఎవరిని కలవాలి ఎలా కలవాలి అనే విషయాలు తెలియవు. స్టూడియోల్లో ఎలా అప్రోచ్‌ అవ్వాలనే విషయం కూడా తెలియదు. అలాంటి సమయంలో ఓ ప్లాట్ ఫామ్‌ ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు కృతజ్ఞతలు.

పాన్ ఇండియా స్టార్‌ డం ఉన్న విజయ్ దేవరకొండను పదేళ్ల క్రితం థియేటర్ వర్క్ షాప్ లో కలిశాను. మళ్లీ ఇప్పుడు ఈ వేడుకకు ఆయన రావడం చాలా మెమోరబుల్‌ మూమెంట్‌. లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాకు ఓటీటీ నుండి చాలా ఆఫర్లు వచ్చాయి. కాని ఆ డీల్స్ కు ఒప్పుకోకుండా జాతి రత్నాలను కాపాడుకుంటూ వచ్చారు. సినిమా తో థియేటర్లలోనే ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయాలని జాతి రత్నాలను భద్రంగా కాపాడుకుంటూ వచ్చారు. నవ్వు జీవితంలో చాలా ముఖ్యం. ఆ నవ్వును మీతో పంచుకునేందుకు ఈనెల 11న వస్తున్నాం అన్నాడు.
Tags:    
  • Naveen Polishetty 
  • Jaathi Ratnalu 
  • jaathi ratnalu pre release event 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS