• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఏజెంట్' బెస్ట్ యాక్టర్...

'ఏజెంట్' బెస్ట్ యాక్టర్ అవార్డుని వాచ్ మెన్ అందుకున్నాడు: పోలిశెట్టి ఫన్నీ పోస్ట్..!

By - Tupaki Desk
Update: 2021-08-10 09:30 GMT
టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి హీరోగా పరిచయమైన చిత్రం ''ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌''. స్వరూప్ ఆర్ఎస్‌జె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ద‌గ్గర భారీ సక్సెస్ అయింది. షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారక్టర్.. ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఒరిజినల్ అంటూ నవీన్ తనదైన శైలి యాక్టింగ్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. అందుకే ఈ చిత్రంలో నవీన్ నటనకు గానూ 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌' తెలుగు కేటగిరీలో బెస్ట్ యాక్టర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు.

'దాదా సాహెబ్‌ ఫాల్కే సౌత్ అవార్డ్స్-2020' జాబితాను ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. దీంతో జ్యూరీ నిర్వహకులు ఈ అవార్డులని గ్రహీతల ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన ఇంటికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డ్ వచ్చిన విషయాన్ని నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే అవార్డు వచ్చినప్పుడు తను ఇంట్లో లేకపోవడంతో వాచ్‌ మెన్‌ దాన్ని అందుకున్నాడని ఫన్నీ పోస్ట్ పెట్టాడు.

''ఇది (అవార్డు) ఈ రోజు ఇంటికి వచ్చింది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రానికి గానూ బెస్ట్ యాక్టర్ గా వచ్చిన దాదాసాహెబ్ ఫాల్క్ అవార్డ్ ఇది. కోవిడ్ కారణంగా షో జరగలేదు. అందుకే వారు దానిని ఇంటికి పంపించారు. అయితే ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేరు.. కాబట్టి మా వాచ్‌ మ్యాన్ ఆ అవార్డ్ అందుకున్నాడు. దాంతో మా బిల్డింగ్ లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు'' అని నవీన్ ట్వీట్ చేసాడు. ఈ సందర్భంగా అవార్డు ఫోటోలు కూడా షేర్ చేశాడు. ఈ క్రమంలో పలువురు నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు రిప్లై కూడా ఇచ్చాడు. నవీన్ పెట్టిన ఈ ఫన్నీ పోస్ట్ ఇప్పుడు వైరల్‌ గా మారింది.

ఇకపోతే 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ - 2020' లో 'మోస్ట్ వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్' గా కింగ్ అక్కినేని నాగార్జున నిలిచారు. 'జెర్సీ' బెస్ట్ తెలుగు మూవీగా నిలవగా.. 'డియ‌ర్ కామ్రేడ్' చిత్రంలో నటనకు గానూ రష్మిక మందన్నా ఉత్త‌మ న‌టిగా సెలెక్ట్ అయింది. బెస్ట్ డైరెక్టర్ - సుజీత్ (సాహో) .. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (అల వైకుంఠపురములో) అవార్డులను జ్యూరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు నవీన్ పోలిశెట్టి ఇంటికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చి చేరింది.

కాగా, నవీన్ పోలిశెట్టి ఈ ఏడాది ప్రారంభంలో 'జాతిరత్నాలు' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించారు. కోవిడ్ సమయంలో రాహుల్‌ రవీంద్రన్‌ - ప్రియదర్శి లతో కలిసి వచ్చిన నవీన్.. యాభై కోట్లకుపైగా వసూళ్ళు రాబట్టి సంచలనం సృష్టించాడు. ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయినప్పటికీ పోలిశెట్టి నవీన్.. ఇంతవరకు తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల నవీన్ స్పందిస్తూ.. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లలో మూడు ప్రాజెక్ట్స్ చేయబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే వీటికి సంబంధించిన వివరాలను తెలియజేస్తానని యువ హీరో ట్వీట్ చేసాడు.
Tags:    
  • Naveen polishetty Comments 
  • Jathiratnalu movie 
  • Naveen Polishetty Jathiratnalu 
  • Agent Sai Srinivas athreya 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS