• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరోసారి 'మిడిల్ క్లాస్'...

మరోసారి 'మిడిల్ క్లాస్' దర్శకుడితో నేచురల్ స్టార్..?

By - Tupaki Desk
Update: 2021-05-27 05:32 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది తెరకెక్కుతున్న సినిమాల సందడి బాగానే పెరిగింది. దాదాపు నాలుగు సంవత్సరాల అనంతరం టాలీవుడ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. వేణు దర్శకుడుగా మారి పదేళ్లు అవుతోంది. కానీ ఇప్పటివరకు చేసింది మూడు సినిమాలే కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2011లో ఓమైఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు.. ఆ తర్వాత 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి - 2021లో వకీల్ సాబ్ సినిమాలు రూపొందించాడు. అయితే ప్రతి సినిమాకు వేణు అంత భారీ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నాడో తెలియదు. కానీ వేణు మాత్రం ఆ గ్యాప్ నేను ఇవ్వలేదు అదే వచ్చిందని అంటున్నాడు.

అయితే ఈ మధ్యకాలంలో దర్శకులు చాలా స్పీడ్ పెంచేసారు. ఓ సినిమా చివరి దశలో ఉండగానే మరో సినిమా ప్రకటించేస్తున్నారు. కానీ అసలే 4ఇయర్స్ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ తీసి ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి నెల దాటిపోయినా వేణు నుండి తదుపరి గురించి కన్ఫర్మేషన్ రాలేదు. కనీసం ఎవరితో అనేది కూడా తెలియలేదు. అయితే తాను సినిమాలు తీయడంలో స్లోనే అని.. వేరే డైరెక్టర్స్ లాగా ఒకేసారి మల్టీప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయలేనని చెప్పేసాడు. వకీల్ సాబ్ అనంతరం వేణు ఇదివరకు పక్కన పెట్టిన 'ఐకాన్' మూవీ తెరపైకి రాబోతుందని అనుకున్నారు. కానీ అది ప్రస్తుతం నిజంగానే పక్కన పెట్టేసారని తెలుస్తుంది. వేణు తదుపరి సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వార్త హల్చల్ చేస్తోంది.

అదికూడా తాను ఇదివరకు పనిచేసిన హీరోతోనే అని టాక్. ఆ హీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకు 2017లో మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా తెరకెక్కింది. ఆ మూవీ బాక్సఫీస్ వద్ద డీసెంట్ హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవలే వేణు నానికి ఓ స్టోరీ లైన్ వినిపించడం జరిగిందట. ఆ లైన్ కూడా నానికి బాగా నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. మరి ఈ లెక్కన వేణు తదుపరి సినిమా నానితోనే అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే నాని కూడా ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ - అంటే సుందరానికి.. సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆ రెండు సినిమాలు పూర్తయ్యాక వీరి మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందట. ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనుందని బజ్ క్రియేట్ అయింది. చూడాలి మరి వేణు తదుపరి సినిమాకు ఇంకెంత టైం పడుతుందో..!
Tags:    
  • nani 
  • Venu sriram 
  • MCA 
  • Nani venu sriram movie update 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS