• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య 'ఆహా' షో లో బిబి...

బాలయ్య 'ఆహా' షో లో బిబి నటరాజ్‌ కు ఏం పని?

By - Tupaki Desk
Update: 2021-10-25 04:29 GMT
నందమూరి బాలకృష్ణ ఆహా టాక్ షో అన్‌ స్టాపబుల్‌ ను ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తామా అంటూ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆహా వారు ఈ టాక్‌ షో ను భారీ ఎత్తున ప్లాన్‌ చేస్తున్నారు. గతంలో వచ్చిన సమంత సామ్‌ జామ్‌ టాక్ షో కంటే భారీగా ఖర్చు పెట్టడంతో పాటు ఓ రేంజ్ లో ప్రమోట్‌ చేసేందుకు ప్రోమోలను కూడా భారీగా షూట్‌ చేస్తున్నారు. ఈ షో కోసం ప్రత్యకంగా ఒక పాటను కూడా కంపోజ్‌ చేయించారనే వార్తలు వస్తున్నాయి. ఆ పాటకు నటరాజ్ మాస్టర్ ఆధ్వర్యంలో బాలయ్య స్పెప్పులు వేస్తున్నాడట. బిగ్‌ బాస్ సీజన్‌ 5 నుండి ఎలిమినేట్‌ అయిన తర్వాత అక్కడక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపించిన నటరాజ్‌ మాస్టర్‌ కు ఈ ఆఫర్ ఖచ్చితంగా కమ్ బ్యాక్‌ మాదిరిగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ తో నటరాజ్ మాస్టర్ వేయించిన స్టెప్పులు ఏంటీ.. ఆ స్టెప్పులు ఎప్పుడు చూస్తామా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ గా ఈ షో నిలుస్తుందనే నమ్మకం అందరిలో కనిపిస్తుంది. ప్రముఖ స్టార్స్ ను బాలయ్య ఇంటర్వ్యూ చేయబోతున్నాడు అనే ఒక థాట్‌ అందరిలో ఎగ్జైట్‌ ను కలిగిస్తుంది. దానికి ఈ డాన్స్ ఇతర విషయాలు మరింతగా హంగులు దిద్దబోతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య తో ఇప్పటికే ప్రశాంత్‌ వర్మ రెండు మూడు ప్రోమోలను షూట్‌ చేయడం జరిగింది. ఒకటి రెండు రోజుల్లోనే ఆ ప్రోమోలను రిలీజ్ చేయబోతున్నారు. దీపావళి సందర్బంగా మొదటి ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా ఆహా వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఇటీవలే మూడు నాలుగు ఎపిసోడ్స్ కు సంబంధించిన షూటింగ్‌ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. కాని గెస్ట్‌ లుగా ఎవరు వచ్చారు అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మొత్తానికి బాలయ్య టాక్ షో ఖచ్చితంగా తెలుగు ఓటీటీ రంగంలో ఒక సంచలనంగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. టాక్ షో కోసం ఒక కొరియోగ్రాఫర్‌ ని పెట్టి మరీ ప్రత్యేకంగా డాన్స్ చేయించారు అంటూ ఈ షో కోసం ఆహా వారు ఎంత ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బాలయ్య ఆహా షో తర్వాత నటరాజ్ మాస్టర్‌ మరిన్ని సినిమాలను దక్కించుకుంటాడేమో చూడాలి. చాలా స్ట్రాంగ్‌ అనుకున్న నటరాజ్ మాస్టర్ తన పద్దతి ప్రవర్తన.. వెకిలి నవ్వు వల్ల ప్రేక్షకుల దృష్టిలో విలన్‌ అయ్యాడు. అందుకే బిగ్‌ బాస్ సీజన్ 5 నుండి చాలా త్వరగా బయట పడ్డాడు. అయినా కూడా వెంటనే అతడు వర్క్ లో బిజీ అయ్యాడు.
Tags:    
  • Choreographer Nataraj Master 
  • Balakrishna 
  • BB Contestant 
  • OTT 
  • Aha 
  • Aha OTT 
  • Akhanda 
  • Akhanda release date 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS