మోదీ బయోపిక్ తెలుగు వెర్షన్ ‘మనోవిరాగి’..టైటిల్ కి గుడ్ రెస్పాన్స్!

Update: 2020-09-17 11:10 GMT
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో బయోపిక్ లో హవా నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్,  కోలీవుడ్ లలో పలువురి ప్రముఖుల జీవితాలపై బయోపిక్ లు తెరకెక్కిస్తున్నారు. కంగనా రనౌత్  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తుండగా..ఇది హిందీ తమిళ్,  తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. ప్రముఖ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ బయోపిక్ కూడా పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో నిర్మితమవుతున్నాయి. ప్రధాని న‌రేంద్ర మోదీ జీవిత కథను ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్  పేరు ‘మనోవిరాగి’.ఇవాళ ప్రధాని మోదీ జన్మదినం. ఈ సందర్భంగా ఈ సినిమా  ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.  టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అందరినీ ఆకట్టుకుంది.

ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, మహవీర్ జైన్ సంయుక్తం గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి  సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. దుకాణం లో  టీ అమ్ముకునే కుర్రాడి స్థాయి  నుంచి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఎదిగిన తీరును ఈ సినిమాలో చూపించనున్నారు. ‘మనోవిరాగి’. మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. పెండింగ్ లో ఉన్న మిగతా షూటింగ్ పార్ట్ ని  పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. కాగా ‘మనోవిరాగి’ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వస్తోంది.
Tags:    

Similar News