• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘శమంతకమణి’...

‘శమంతకమణి’ చేయకూడదనుకున్నా-నారా రోహిత్

By - Tupaki Desk
Update: 2017-07-10 07:07 GMT
టాలీవుడ్లో ఇద్దరు హీరోలు కలిసి నటించడమే అరుదు. అలాంటిది ‘శమంతకమణి’లో ఏకంగా నలుగురు యువ కథానాయకులు కలిసి నటించారు. ఆ కలయిక జనాల్లో ఆసక్తి రేకెత్తించింది. దీని టీజర్.. ట్రైలర్ కూడా సినిమా మీద అంచనాలు పెంచాయి. మంచి అంచనాల మధ్య ఈ శుక్రవారమే విడుదల కాబోతున్న ‘శమంతకమణి’.. అంచనాలకు తగ్గట్లు ఉంటే టాలీవుడ్లో సరికొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టడం ఖాయం. ఐతే ఇంత మంచి బజ్ తెచ్చుకున్న సినిమాలో అసలు నటించొద్దని అనుకున్నాడట నారా రోహిత్. అందుకు కారణం తనకు ఈ చిత్రంలో పోలీస్ క్యారెక్టర్ ఆఫర్ చేయడమేనట.

ఇప్పటికే తాను మూడు సినిమాల్లో పోలీస్ పాత్రల్లో నటించానని.. మళ్లీ పోలీస్ క్యారెక్టర్ అంటే మొనాటనీ వచ్చేస్తుందన్న ఉద్దేశంతో ‘శమంతకమణి’ చేయొద్దని అనుకున్నానని రోహిత్ తెలిపాడు. ఐతే ఈ కథ విన్నాక తాను కాదని అనలేకపోయానని చెప్పాడు. వాస్తవానికి తాను చేసిన పాత్ర ముందు నాగశౌర్య దగ్గరికి వెళ్లిందని.. కానీ అతను చేయలేక తనకు రెఫర్ చేశాడని.. ఈ విషయంలో అతడికి థ్యాంక్స్ చెప్పాలని రోహిత్ అన్నాడు. ఈ సినిమాతో తనకు సందీప్ కిషన్.. ఆది.. సుధీర్ బాబుల రూపంలో ముగ్గురు మంచి మిత్రులు దొరికారని.. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని చాలా బాగా డీల్ చేశాడని రోహిత్ తెలిపాడు. నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్ కు ‘శమంతకమణి’ పైసా వసూల్ సినిమా కావాలని.. తర్వాత సెప్టెంబరులో ‘పైసా వసూల్’ కూడా మంచి విజయాన్ని అందించాలని రోహిత్ ఆకాంక్షించాడు.
Tags:    
  • Nara Rohith 
  • Samanthakamani movie 
  • Telugu NEws 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS