• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'శ్యామ్ సింగ రాయ్' మోషన్...

'శ్యామ్ సింగ రాయ్' మోషన్ పోస్టర్: రెండు భిన్నమైన అవతారాల్లో నాని..!

By - Tupaki Desk
Update: 2021-10-14 11:36 GMT
నేచురల్ స్టార్ నాని హీరోగా 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ''శ్యామ్‌ సింగ రాయ్‌''. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాని - సాయి పల్లవి - కృతి శెట్టి ఫస్ట్ లుక్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో దసరా పండుగను పురస్కరించుకుని నాని పోషిస్తున్న రెండో పాత్రను 'వాసు'గా పరిచయం చేశారు

స్టైలిష్ అవతార్‌ లో ఉన్న నాని.. ఈ పోస్టర్ లో ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ఇంటెన్స్ గా చూస్తూ కనిపిస్తున్నాడు. బ్యాగ్రౌండ్ లో ఉన్న కాళీ మాత చిత్రం ఆ పాత్ర తీవ్రతను తెలియజేస్తోంది. బెంగాలీ కుర్రాడి గెటప్ లో కనిపించిన నాని ఫస్ట్ లుక్ కి ఇది పూర్తి భిన్నంగా ఉంది. ఈ పోస్టర్‌ లో 'అతని ప్రేమ. అతని వారసత్వం మరియు అతని మాట' అనే ట్యాగ్‌ లైన్ ని గమనించవచ్చు. ఇది నాని రెండు పాత్రల మధ్య ఏదో సంబంధం ఉందనే విషయాన్ని సూచిస్తుంది.

ఈ క్రమంలో నాని రెండు పాత్రలను చూపించే మోషన్ పోస్టర్‌ ని కూడా మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. కాళీ మాత ఆలయంలో శ్యామ్ సింగ రాయ్ ని చూపిస్తూ.. కాళీ మాత పోస్టర్ నుంచి వాసు లుక్ ని రివీల్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ కి మిక్కీ జె మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. అలానే ఇందులో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని తెలుస్తోంది.

'శ్యామ్ సింఘ రాయ్‌' చిత్రాన్ని 2021 డిసెంబర్‌ లో థియేటర్లలోనే విడుదల చేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇప్పటికే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా.

సత్యదేవ్‌ జంగా ఈ చిత్రానికి కథ అందించారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవివర్మ యాక్షన్ కొరియోగ్రఫర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. 'శ్యామ్‌ సింగ రాయ్‌' చిత్రంలో జిషు సేన్‌ గుప్తా - రాహుల్‌ రవీంద్రన్‌ - మురళీ శర్మ - అభినవ్‌ గోమటం - లీలా శాంసన్ - మనీష్ వాద్వా - బారున్ చందా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Full View
Tags:    
  • Nani 
  • Shyam Singha Roy 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS