నాని - రానా మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ తో స‌ర్ ప్రైజ్ ట్రీట్‌

Update: 2020-09-14 11:50 GMT
`బాహుబ‌లి` త‌రువాత తెలుగు సినిమా స్వ‌రూప‌మే పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలు కూడా క‌మ‌ర్శియ‌ల్ చిత్రాలు మాత్ర‌మే చేస్తామ‌ని చెప్ప‌డం లేదు. కొత్త త‌ర‌హా సినిమాలు చేయ‌డానికే అత్య‌ధికంగా ఆస‌క్తిని చూపిస్తున్నారు. దీంతో మునుపెన్న‌డూ లేని విధంగా తెలుగులో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు వ‌స్తున్నాయి. అందులో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు కూడా వుంటున్నాయి.

ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ఈ త‌ర‌హా చిత్రాలపై ప్ర‌త్యేక ఆస‌క్తిని చూపిస్తుండ‌టంతో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల నిర్మాణం ఈ మ‌ధ్య ఊపందుకుంది. ఇటీవ‌ల విడుద‌లైన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి`, ప్ర‌స్తుతం సెట్స్ పై వున్న `ఆర్ ఆర్ ఆర్‌` త్వ‌ర‌లో సెట్స్ పైకి రాబోతున్న `మ‌హా స‌ముద్రం` వంటి చిత్రాలతో పాటు మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌పైకి రాబోతోంద‌ని తెలిసింది.

ఇందులో నేచుర‌ల్ స్టార్ నాని- రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టించ‌బోతున్నార‌ట‌. ఇండ‌స్ట్రీలో వున్న హీరోల్లో ఈ ఇద్ద‌రు హీరోల మ‌ధ్య మంచి స్నేహ బంధం వుంది. దాంతో వీరిద్ద‌రిని క‌లిపి ఒక సినిమాలో చూపించాల‌ని రానా ఫాద‌ర్ డి. సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఓ ప్ర‌ముఖ ర‌చ‌యిత ఈ చిత్రానికి ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌ని అందిస్తున్నార‌ట‌. ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది. మ‌ల్టీస్టార‌ర్ కి సంబంధించిన అధికారిక వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.
Tags:    

Similar News