• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాతో సినిమా.. ఎవరు...

నాతో సినిమా.. ఎవరు చూస్తారనుకున్నా-నాని

By - Tupaki Desk
Update: 2016-06-16 04:30 GMT
‘అష్టాచమ్మా’ సినిమాకు తనను హీరోగా ఎంచుకున్నపుడు చాలా ఆశ్చర్యపోయానంటున్నాడు నాని. దర్శక నిర్మాతలకు తన మీద నమ్మకం ఉన్నా.. అప్పటికి తన మీద మాత్రం తనకు ఏమాత్రం నమ్మకం లేదని నాని చెప్పాడు. హీరోగా నిలదొక్కుకుంటానని ఏమాత్రం ఆశ లేకుండా ఆ సినిమా చేశానన్నాడు నాని. ‘‘మోహనకృష్ణ గారు.. రామ్మోహన్ గారు నాతో ‘అష్టా చమ్మా’ సినిమా తీస్తుంటే.. వీళ్లు అమాయకుల్లా ఉన్నారు. నాతో సినిమా తీస్తున్నారు, ఎవరు చూస్తారులే అనుకున్నా. దర్శక నిర్మాతలకు నాపై నమ్మకం ఉన్నా.. నా మీద నాకే నమ్మకం లేదు. ‘అష్టా చమ్మా’ అయిపోయాక మళ్లీ అసిస్టెంట్ డెరైక్టరుగానే ఉండిపోదాం అనుకున్నా. భవిష్యత్తులో ఓ ఇరవై ఏళ్లు గడిచాక.. వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడినో చూసుకోవాలంటే ‘అష్టాచమ్మా’ డీవీడీ ఉంటుందనే ఆలోచనతో ఆ సినిమా చేశా. కానీ ఆ చిత్రం సక్సెస్ కావడంతో.. ప్రేక్షకులు నన్ను కూడా ఇష్టపడుతున్నార నే నమ్మకం పెరిగింది’’ అని నాని చెప్పాడు.

‘అష్టాచెమ్మా’ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఇంద్రగంటితో పని చేయడం గురించి చెబుతూ.. ‘‘మనిద్దరికీ సరిపడే కథ అయితేనే మళ్లీ సినిమా చేద్దాం అనేవారాయన. జెంటిల్ మన్ కథపై ఇద్దరికీ నమ్మకం కుదిరాకే కలిపి పని చేశాం. ‘అష్టాచమ్మా’ చేస్తున్నప్పుడు ఇంద్రగంటిగారు ఓ మంచి రైటర్. ఆ తర్వాతే డెరైక్టర్. కానీ ఇప్పుడు పరిశీలిస్తే ఆయన అంతే మంచి రైటర్.. అంతకుమించి మంచి డెరైక్టర్ అనిపిస్తోంది. టెక్నికల్ నాలెడ్జ్ అప్పటికీ ఇప్పటికీ చాలా పెరిగింది’’ అని నాని చెప్పాడు. ‘జెంటిల్ మన్’ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ ‘‘ఇందులో జై అనే క్యారెక్టర్ చేస్తున్నా. కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానిగా కనిపిస్తా. నా పాత్రలో రొమాంటిక్ యాంగిల్‌ తో పాటు మరో యాంగిల్ కూడా ఉంది. అదేంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నేనింతకుముందు చేసిన చిత్రాలతో పోల్చితే కథాబలమున్న చిత్రమిది. అందుకే ప్రేమించి చేశా. వాస్తవానికి కథ విన్నప్పుడు ఈ పాత్ర చేయగలనా? లేదా? అనే సందేహం కలిగింది. అంతటి క్లిష్టమైన పాత్ర ఇది’’ అని నాని అన్నాడు.
Tags:    
  • Nani 
  • Gentleman Movie 
  • Telugu NEws 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS