అటు అనసూయ.. ఇటు ఇంద్రజ.. మధ్యలో నాని..!
నిజానికి సినిమా ప్రమోషన్స్ లో తక్కువగానే పాల్గొంటుంటాడు హీరో నాని. కానీ.. ఇప్పుడు రూట్ మార్చాడు. ‘వి’ డిజాస్టర్ తర్వాత వస్తున్న ‘టక్ జగదీష్’ను భారీగా ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రెస్ మీట్లతోపాటు.. పలు రకాల టీవీ షోలలో కూడా పాల్గొనేందుకు టక్ తీసేసి మరీ వచ్చేస్తున్నాడు.
రాబోయే ఉగాది సందర్భంగా టక్ జగదీష్ ట్రైలర్ ను లాంఛ్ చేయబోతోంది యూనిట్. దీంతో.. ఈలోగానే ప్రమోషన్ పీక్ స్టేజ్ కు చేర్చాలని సిద్ధమయ్యాడు నేచురల్ స్టార్. ఇక, ఉగాది పర్వదినం అనగానే.. పలురకాల టీవీ షోస్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ను డిజైన్ చేస్తాయి. వాటిల్లో చాలా వరకు చుట్టేసే పనిలో ఉన్నాడట నాని.
ఇప్పటికే జబర్దస్త్ స్టేజ్ ను కవర్ చేసేశాడు నాని. పై ఫొటో చూడండి. ఇటు అనసూయ.. అటు ఇంద్రజను పెట్టుకొని మధ్యలో ఇరగదీసే స్టెప్పులు వేశాడీ హీరో. జబర్దస్త్ జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ, యాంకర్ అనసూయ భరద్వాజ్ తో కలిసి దుమ్ము లేపాడు.
సింపుల్ కాజువల్స్ తో అద్దిరిపోయే లుక్ తో నాని గెటప్ విశేషంగా ఆకర్షిస్తోంది. ఉగాది నాటికి ఈ ప్రమోషన్ ఏ రేంజ్ కు చేరుతుందో చూడాలి. ఉగాది రోజున ట్రైలర్ లాంచ్ చేస్తుండగా.. ఈ నెల 23 న సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.