2020 వరకు అప్పుడే ఫిక్సయ్యాడు

Update: 2018-11-30 10:54 GMT
యంగ్‌ హీరో నాని జోరు కొనసాగిస్తున్నాడు. వరుస విజయాల తర్వాత ‘దేవదాసు’ కాస్త నిరాశ పర్చినా కూడా నాని మాత్రం తన దూకుడును తగ్గించడం లేదు. ‘దేవదాసు’ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని ‘జర్సీ’ చిత్రంతో వచ్చే ఏప్రిల్‌ లో నాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘జర్సీ’ చిత్రం ఒకవైపు చిత్రీకరణ జరుగుతుండగానే మరో వైపు వరుసగా నాని సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు. జర్సీ సినిమా తర్వాత నాని చేయబోతున్న సినిమాకు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

నాని, విక్రమ్‌ ల మూవీని మైత్రి వారు సెట్‌ చేశారు. వచ్చే ఏడాది ద్వితీయార్థం ఆరంభంలోనే నాని, విక్రమ్‌ ల మూవీ వచ్చే అవకాశం ఉంది. ఇక నాని చాలా రోజులుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్‌ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 2019 ద్వితీయార్థంలో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని, దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని సమాచారం అందుతోంది. తాజాగా అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో కూడా నటించేందుకు నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సినీవర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం మల్టీస్టారర్‌ చిత్రం చేస్తున్న అనీల్‌ రావిపూడి తాజాగా నానికి ఒక మాస్‌ మసాలా కథను చెప్పి ఓకే చెప్పించుకున్నాడట. వచ్చే ఏడాదిలోనే ప్రారంభిద్దామని కూడా హామీ ఇచ్చాడట. ప్రస్తుతం చేస్తున్న జర్సీ కాకుండా మూడు సినిమాలకు కమిట్‌ అయిన నాని 2020 వరకు వరుసగా సినిమాలు ఫిక్స్‌ అయ్యాయి. ఈ ముగ్గురు మాత్రమే కాకుండా నాని వెయిటింగ్‌ లిస్ట్‌ లో త్రివిక్రమ్‌ కూడా ఉన్నాడట. ఇక నానితో మరే దర్శకుడైనా సినిమా చేయాలనుకుంటే 2021 వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News