• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  6 నెల‌ల్లో 2 కోట్లు...

6 నెల‌ల్లో 2 కోట్లు కొట్టేసింది!

By - Tupaki Desk
Update: 2018-12-26 04:05 GMT
దీపం ఉండ‌గానే ఇల్లు స‌ర్ధేయ‌డం ఎలానో తెలియాలిక్క‌డ‌. ఈ విష‌యంలో మ‌న భామ‌లు మ‌హా ముదుర్లు. త‌మ‌వైపు వ‌చ్చే ఒక్కో అవ‌కాశాన్ని ఒడిసిప‌ట్టుకుని తెలివిగా ఆర్జించ‌డంలో ఖ‌త‌ర్నాక్ లు అంటే త‌ప్పేం లేదు. ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఏకంగా ఇండ‌స్ట్రీని గుప్పిట్లోకి తీసుకుంటోంది నందిత శ్వేత‌. ఈ అమ్మ‌డు నిఖిల్ స‌ర‌స‌న `ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా?` చిత్రంలో న‌టించింది. ఆత్మ ఆవ‌హించిన ప్రేయ‌సిగా భీభ‌త్స భ‌యాన‌క ఆహార్యంతో క‌ట్టి ప‌డేసింది. ఆ సినిమా చూశాక నందిత‌కు అభిమాని కానివాడు లేడంటే అతిశ‌యోక్తి కాదు. స‌రిగ్గా అదే క్రేజు ఈ అమ్మ‌డికి ఏకంగా అర‌డ‌జ‌ను పైగా అవ‌కాశాల్ని తెచ్చింది. ప్ర‌స్తుతం బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ `ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2`లోనూ ఈ భామ క‌థానాయిక‌.

ఈనెల 28న నందిత శ్వేత న‌టించిన `బ్ల‌ఫ్ మాస్ట‌ర్` రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగిన ఓ ఇంట‌ర్వ్యూలో నందిత ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేసింది.  బెంగళూరు నా స్వ‌స్థ‌లం. 2008లో మోడలింగ్ చేస్తున్న సమయంలో  ఓ కన్నడ సినిమాలో తొలి అవకాశం వచ్చింది. అలా సినిమాల్లోకి వచ్చాను. ఆ త‌ర్వాత నా మొదటి తెలుగు సినిమా `ఎక్కడకు పోతావు చిన్నవాడా?` నా ఫేట్ మార్చేసింది. ఆ సినిమాలో నేను చేసిన అమల క్యారెక్టర్ ఎంతో పేరు తెచ్చింది. న‌టిగా నిరూపించుకునే అవ‌కాశం తొలి ప్ర‌య‌త్న‌మే ద‌క్కింది.. అని తెలిపింది. 

ఆ ఒక్క ఛాన్స్ ఈ అమ్మ‌డికి అర‌డ‌జ‌ను అవ‌కాశాలిచ్చింది. కెజిఎఫ్ తో 100కోట్ల క్ల‌బ్ హీరోగా వెలిగిపోతున్న‌ కన్నడ రాక్‌ స్టార్ యశ్ స‌ర‌స‌న ఓ సినిమాకి ఛాన్సొచ్చింది. క‌న్న‌డ‌లో అత్యంత భారీగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అలాగే తెలుగులో - సెవెన్ - అక్షర - ప్రేమకథా చిత్రమ్ 2 ఇలా వరుస సినిమాలు ఖాతాలో ఉన్నాయి. ఇంకా మరో రెండు సినిమాల‌కు సంత‌కాలు చేశాన‌ని నందిత తెలిపింది. ఈ క్యూటీ ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటోంది? అన్న‌ది ఆరాతీస్తే..  క‌మిట్ మెంట్ కి రూ.30-40ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే అర‌డ‌జ‌ను సినిమాలు క్యూలో ఉన్నాయి. సుమారు 2 కోట్ల వ‌ర‌కూ ఆర్జించింది ఇప్ప‌టికే. కేవ‌లం  ఈ ఆరు నెల‌ల్లోనే ఫేట్ డిసైడైంది. 2018 ఈ అమ్మ‌డికి బాగా క‌లిసొచ్చింది. అయితే అంత‌కుముందు ప‌దేళ్ల జ‌ర్నీలో ఎంత పోరాటం సాగించిందో ఓ మారు గుర్తు చేసుకోవాలి.
   

Tags:    
  • Nanditha Swetha 
  • Movie Offers 
  • Telugu Film Industry 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS