దిల్ రాజు పార్టీలో కనిపించని నందమూరి హీరోలు..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. దిల్ రాజు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె హన్షితా రెడ్డి 'దిల్ రాజు@50ఇయర్స్' అనే పేరుతో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. బర్త్ డే కి ఒకరోజు ముందే (గురువారం) జరిగిన ఈ వేడుకలకు దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అంతా హాజరైనట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి సోషల్ మీడియా మొత్తం దిల్ రాజు బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి - సూపర్ స్టార్ మహేష్ బాబు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - రామ్ చరణ్ - అక్కినేని నాగచైతన్య - అఖిల్ అక్కినేని - విజయ్ దేవరకొండ - నితిన్ - రామ్ పోతినేని - విశ్వక్ సేన్ - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - 'కేజేఎఫ్' దర్శక హీరోలు ప్రశాంత్ నీల్ మరియు రాకింగ్ స్టార్ యష్ తదితరులు హాజరయ్యారు. అలానే సమంత - పూజా హెగ్డే - రాశీఖన్నా - అనుపమ పరమేశ్వరన్ - నివేదా పేతురాజ్ వంటి హీరోయిన్లు కూడా ఈ పార్టీలో సందడి చేశారు. అయితే వీరిలో నందమూరి హీరోలు లేకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది.
దిల్ రాజు బర్త్ డే వేడుకలకు మెగా ఫ్యామిలీ నుంచి చిరు - పవన్ - చరణ్ అటెండ్ కాగా.. అక్కినేని ఫ్యామిలీ నుంచి చైతన్య - అఖిల్ - సామ్ హాజరయ్యారు. మహేష్ కూడా సతీసమేతంగా విచ్చేశాడు. ఇలా దిల్ రాజు తో సినిమాలు చేసిన వారు చేయని వారు అందరూ ఈ పార్టీలో కనిపించారు. కానీ నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ - ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లలో ఎవరూ కూడా దీనికి అటెండ్ అయినట్లు కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దిల్ రాజు ఈ పార్టీకి బాలయ్య ను ఆహ్వానించలేదని.. అందుకే తారక్ - కళ్యాణ్ రామ్ కూడా ఈ వేడుకకు దూరంగా ఉన్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి దిల్ రాజు నందమూరి హీరోలతో చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటాడు. ఎన్టీఆర్ తో పలు సినిమాలు ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు.. బాలకృష్ణ - కళ్యాణ్ రామ్ నటించిన పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయినప్పటికీ వాళ్ళెవరూ ఈ పార్టీలో లేకపోవడం చర్చనీయాంశం అయింది. ఇందులో దగ్గుబాటి హీరోలు కూడా లేకపోవడం గమనార్హం. అయితే వీరు నిజంగానే పార్టీలో లేరా?లేదా వచ్చినప్పటికీ ఆ ఫోటోలు బయటకు రాలేదా? అన్నది తెలియాల్సి ఉంది.