• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అఖండ' షూటింగ్ పూర్తి.....

'అఖండ' షూటింగ్ పూర్తి.. ఇక నటసింహ గర్జనే మిలిగిలింది..!!

By - Tupaki Desk
Update: 2021-10-05 07:39 GMT
నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక పాటను చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తయిందని తెలిపారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయని.. త్వరలోనే 'అఖండ' విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో గర్జించబోతోంది అంటూ ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో బాలయ్య - బోయపాటి శ్రీను - నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మరియు శ్రీధర్ థమ్స్ అప్ చూపిస్తూ షూటింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తయినందుకు సంతోషంగా కనిపిస్తున్నారు.

'అఖండ' సినిమాతో బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఆడియన్స్ పల్స్ తెలిసిన బోయపాటి శ్రీను.. బాలయ్య ను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అఘోరా గా కనిపించనున్నారు. ఇప్పటికే నటసింహం యొక్క రెండు పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్లకు విశేష స్పందన లభించింది. అలానే 'అడిగా అడిగా' అనే ఫస్ట్ సింగిల్ సంగీత ప్రియులను అలరించింది.

'అఖండ' విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో జగపతిబాబు - శ్రీకాంత్ - పూర్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Tags:    
  • Nandamuri Balakrishna 
  • Akhanda Shooting 
  • Akhanda Teaser 
  • Akhanda Release Date 
  • Pragya Jaiswal 
  • Jagapathi Babu 
  • Srikanth 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS