బిగ్ బాస్ 6 : నాగ్ మొదటి వారం లోనే ఏకిపారేశాడు

Update: 2022-09-11 08:42 GMT
తెలుగు బిగ్ బాస్ మొదటి వీకెండ్‌ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. సాదారణంగా శనివారం ఎపిసోడ్‌ లో కంటెస్టెంట్స్ యొక్క ప్రవర్తనపై నాగార్జున కామెంట్స్ చేస్తూ వారు ఏమైనా తప్పు చేస్తే అది చెప్పి వారిని ఏకి పారేయడం జరుగుతుంది. ఆదివారం ఎపిసోడ్‌ ని ఫన్ డే గా నిర్వహిస్తాడు. నిన్న శనివారం ఎపిసోడ్ మొదటి వీకెండ్‌ ఎపిసోడ్‌ అయినా కూడా నాగార్జున కొందరి తీరుపై తీవ్రంగా స్పందించాడు.

ఫైమా ని యాక్టివ్‌ గా ఉండాలని సూచించడంతో పాటు తనకు తాను తగ్గించుకుని మాట్లాడటం తగ్గించాలంటూ సూచించాడు. ఆమె నుండి మంచి ఎంటర్‌ టైన్‌మెంట్ ను ఆశిస్తున్నాం అన్నాడు. పింకీ ఇమేజ్ నుండి బయట పడి సుదీప తనను తాను చూపించాలని నాగ్ పేర్కొన్నాడు. ఇక సింగర్ రేవంత్‌ పై కాస్త సీరియస్ గానే నాగార్జున స్పందించాడు. మెచ్యూరిటీతో వ్యవహరించాలని అన్నాడు. జబర్దస్త్‌ చంటి విషయంలో నాగ్‌ పెదవి విరిచాడు.

తనదైన శైలిలో చంటి ఉండలేక పోవడంకు కారణం ఏంటీ అంటూ ప్రశ్నించాడు. నీవు నీలాగే ఉండు.. బద్దకంగా నేను ఇలాగే ఉంటాను అంటే బాగోదు అన్నట్లుగా  నాగ్‌ కాస్త సీరియస్ టోన్ లోనే కామెంట్స్ చేశాడు. ఆది రెడ్డి విషయంలో కూడా నాగార్జున కాస్త గట్టిగానే మాట్లాడాడు. ఇతరుల విషయంలో మధ్యలో వెళ్లి కెలికే విషయాన్ని మానుకోవాలంటూ ఆదిరెడ్డికి సూచించాడు.

ఇక్కడ ఒక కంటెస్టెంట్ మాదిరిగా వ్యవహరించాలి కానీ రివ్యవూర్‌ గా కాదు అంటూ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చాడు. ఏ విషయంలో అన్నట్లుగా ఆది ఆలోచిస్తూ ఉండగా మరీ అంతగా ఆలోచించకు అంటూ నాగ్‌ అన్నాడు. ఇక మెరీనా మరియు రోహిత్‌ ల విషయంలో కూడా నాగార్జున స్పందించాడు. మీరు ఇద్దరు భార్య భర్తలు మీకు హగ్‌ చేసుకునే అన్ని రకాల రైట్స్ ఉన్నాయంటూ నాగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇద్దరిని హగ్‌ చేసుకోవాలంటూ నాగార్జున చెప్పడంతో అందరి ముందే ఇద్దరు గట్టిగా హగ్‌ చేసుకున్నారు. ఒక్కో కంటెస్టెంట్‌ విషయంలో తాను అవుతున్న ఫీల్‌ ని థమ్స్ అప్‌ మరియు థమ్స్ డౌన్‌ అని పెట్టాడు. కొందరు ఇంకా తమ యొక్క నిజ స్వరూపం ను బయటకు తీసుకు రావడం లేదు అంటూ నాగార్జున అన్నాడు. వచ్చే వారం నుండి అయినా కంటెస్టెంట్స్‌ వారి యొక్క పూర్తి ప్రతిభను చూపిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News