బిబి4: అభి 'పిల్లలు ఎలా పుడతారు' ప్రశ్నకు నాగ్‌ ఫన్నీ సమాధానం

Update: 2020-12-14 06:59 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ హోస్ట్‌ గా నాగార్జున పూర్తి న్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది. ప్రేక్షకులు మరియు నెటిజన్స్ అంతా కూడా ఆయన హోస్టింగ్‌ విషయంలో పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఈ సీజన్‌ లో మోనాల్‌ ను ఓట్లు పడకున్నా ఎలిమినేషన్‌ చేయడం లేదు అంటూ నాగార్జునపై విమర్శలు మినహా ఇతర విమర్శలు ఏమీ కూడా ఆయనపై రాలేదు. మోనాల్‌ విషయం బిగ్‌ బాస్‌ టీంకు తెలిసి ఉంటుంది. నాగ్ కు ఆ విషయంలో సంబంధం లేదు అనే వారు కూడా లేకపోలేదు. సమయస్ఫూర్తిగా నాగార్జున వేస్తున్న పంచ్‌ లు కాని ఇతర విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి.

గత వారం ఏకగ్రతతో టైమ్‌ లెక్కించే టాస్క్‌ లో భాగంగా మోనాల్‌ ను ఫన్నీగా పిల్లలు ఎలా పుడుతారు అంటూ ప్రశ్నించిన విషయం తెల్సిందే. ఆ ప్రశ్నకు ఆమె అమ్మ ఆసుపత్రికి వెళ్తే డాక్టర్‌ హెల్ప్‌ చేస్తే పిల్లలు పుడతారు. అదో గాడ్‌ గిఫ్ట్‌ అంటూ సమాధానం చెప్పింది. ఆమె సమాధానంకు చాలా మంది ఇంప్రెస్‌ అయ్యారు. అదే ప్రశ్నను అభిజిత్‌ ను నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌ లో అడిగాడు. అభిజిత్‌ ఆ ప్రశ్నతో నిలబడి పోయాడు. ఏం చెప్పాలో అర్థం కాక తికమకగా దిక్కులు చూస్తున్న సమయంలో నాగార్జున స్పందిస్తూ ఎలా పుడతారంటే ఏడుస్తూ పుడతారు అంటూ ఆటో పంచ్‌ వేసి అందరిని నవ్వించాడు. మొత్తానికి నాగార్జున సమయస్ఫూర్తికి అభినందనలు అంటూ నాగ్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tags:    

Similar News