రాజమౌళి 'వారణాసి'.. మళ్లీ మళ్లీ చూసేలా ప్లాన్!

వారణాసి వరల్డ్ చూశాక.. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజ్ లో పెట్టుకున్నారు. గ్లింప్స్ లోని ఎలిమెంట్స్ కు అట్రాక్ట్ అయిపోయారు.;

Update: 2025-12-08 12:29 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న వారణాసి మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన క్షణం నుంచే భారీ హోప్స్ పెట్టుకున్నారు ఆడియన్స్, అభిమానులు. మూవీ ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు చూసేద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



 


రీసెంట్ గా వారణాసి మేకర్స్ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ముఖ్యంగా గ్లింప్స్ కు అంతా ఫిదా అయిపోయారు. వారణాసి వరల్డ్ చూశాక.. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజ్ లో పెట్టుకున్నారు. గ్లింప్స్ లోని ఎలిమెంట్స్ కు అట్రాక్ట్ అయిపోయారు.

అయితే ఇప్పుడు గ్లింప్స్ ను రాజమౌళి.. మరోసారి చూశారు. అది మామూలు విషయమే కదా అని అనుకుంటున్నారా?.. జక్కన్న తాజాగా వారణాసి వరల్డ్ ను ప్రసాద్స్ లోని  పీసీఎక్స్ స్క్రీన్ పై చూశారు. ఆ విషయాన్ని ప్రసాద్ ఐమ్యాక్స్.. సోషల్ మీడియాలో తెలిపింది. పిక్స్ కూడా షేర్ చేయగా.. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

అదే సమయంలో రాజమౌళి.. పీసీఎక్స్ స్క్రీన్ పై చూడడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ప్రసాద్ ఐమ్యాక్స్ లో మరికొద్ది రోజుల్లో పీసీఎక్స్ స్క్రీన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే వర్క్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ మూవీ కూడా ఆ స్క్రీన్ పై రిలీజ్ అవ్వలేదు. అందుకే జక్కన్న.. గ్లింప్స్ చూడడం అందరినీ ఆకర్షించింది.

వారణాసి సినిమాతో ఆ స్క్రీన్ అందుబాటులోకి వస్తుందేమోనని ఇప్పుడు సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. నిజానికి.. పీసీఎక్స్ స్క్రీన్ పై గ్లింప్స్ ను ప్లే చేయగా.. అందుకు సంబంధించిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫుల్ క్లారిటీతో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉందని కామెంట్లు పెడుతున్నారు. అది నిజమని చెప్పాలి.

దీంతో వారణాసి మూవీ విషయంలో జక్కన్న కొత్త ప్లాన్ వేస్తున్నట్లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా సినిమాను అంతా తమకు దగ్గరగా ఉన్న థియేటర్స్ లో కచ్చితంగా చూస్తారు. కానీ పీసీఎక్స్ వంటి స్క్రీన్ పై బొమ్మ పడితే.. ఆ ఎక్స్పీరియన్స్ ను విట్నెస్ చేసేందుకు మరోసారి వెళ్లి చూస్తారు. దీంతో రిపీట్ మోడ్ లో సినిమా వీక్షిస్తారు. అలా మళ్లీ మళ్లీ మూవీ చూసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారని.. వర్కౌట్ కూడా అవుతుందని కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News