• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రేమమ్ రీమేక్.. నాగ్,...

ప్రేమమ్ రీమేక్.. నాగ్, వెంకీ ఏం చేస్తారు?

By - Tupaki Desk
Update: 2015-11-13 11:30 GMT
ఈ ఏడాది మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘ప్రేమమ్’. ఈ చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య కథానాయకుడిగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చైతూ మామూలుగానే లవ్ స్టోరీలకు ఫేమస్. ఇది మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కావడంతో ఈ ప్రాజెక్టుకు ముందే మంచి క్రేజ్ వచ్చేసింది. చందూ మొండేటి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, రాధాకృష్ణ లాంటి ఫేమస్ ప్రొడ్యూసర్ సినిమాను నిర్మిస్తుండటంతో ఇంకా షూటింగ్ కూడా మొదలవకముందే పాజిటివ్ బజ్ నెలకొంది ఈ మూవీ మీద. దీనికి తోడు నాగార్జున - వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తుండటం మరింత ఆసక్తి కలిగించేదే.

ఇంతకీ నాగార్జున - వెంకటేష్ ఇందులో ఎలాంటి పాత్రలు పోషిస్తారా అని జనాలు ఆసక్తితో ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందులో నాగార్జున చైతూకి తండ్రిగా నటిస్తాడట. సినిమాలో ఓ సన్నివేశంలో చైతూ అండ్ గ్యాంగ్ పోకిరి వేషాలపై సీరియస్ అయిన ప్రిన్సిపాల్ వాళ్ల తండ్రుల్ని పిలుస్తాడు. ఆ సందర్భంగా హీరో తండ్రి వచ్చి ప్రిన్సిపాల్ కే ఝలక్ ఇస్తాడు. ఇది కేవలం ఐదు నిమిషాల సన్నివేశమే. ఈ సీన్ లోనే నాగ్ సందడి చేయబోతున్నాడు. ఇక వెంకీది హీరో ఫస్ట్ లవర్ కి తండ్రి పాత్ర అంటున్నారు. తన కూతురి వెంట పడే అబ్బాయిల్ని చితకబాదడం ఈ పాత్ర నైజం. నాగ్ - వెంకీలు పోషించబోయే పాత్రలు రెండూ ఒరిజినల్ లో బాగా హైలైట్ అయ్యాయి. చందూ మొండేటి ఆ పాత్రల్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దాడట.
Tags:    
  • Nagarjuna 
  • Venkatesh 
  • Premam Remake 
  • Telugu NEWs 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS