#స‌డెన్ ట్విస్ట్‌: బాలీవుడ్ కి అక్కినేని నాగ‌చైత‌న్య‌?

Update: 2021-01-25 11:00 GMT
ప్ర‌స్తుతం పాన్ ఇండియా ఫీవ‌ర్ అంత‌కంత‌కు రాజుకుపోతోంది. టాలీవుడ్ లో అగ్ర హీరోల మ‌ధ్య ఆ పోటీ స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ త‌ర్వాత బ‌న్ని.. మ‌హేష్ .. చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్ ఇలా వ‌రుస‌గా స్టార్లంతా పాన్ ఇండియాల‌పై క‌న్నేశారు. ఇరుగు పొరుగు భాష‌ల్లో మార్కెట్ పెంచుకోగ‌లిగితే ఆ మేర‌కు త‌మ సినిమాల బిజినెస్ రేంజు అమాంతం పెరుగుతుందన్న‌ది అస‌లు వ్యూహం.

ఇప్పుడు అదే తీరుగా అక్కినేని నాగ‌చైత‌న్య ఆలోచిస్తున్నారా? .. అతడు పాన్ ఇండియా అప్పీల్ కోసం ప్ర‌య‌త్నాల్లో ఉన్నారా? అంటే అవున‌నే స‌మాచారం. అంతేకాదు.. చైతూ ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న అమీర్ ఖాన్ రీమేక్ మూవీలో చేర‌తాడ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అమీర్ ప్ర‌స్తుతం ఫారెస్ట్ గంప్ (హాలీవుడ్) రీమేక్ `లాల్ సింగ్ చ‌ద్దా` లో న‌టిస్తున్నారు. ఇందులో ఒక కీల‌క పాత్ర కోసం విజ‌య్ సేతుప‌తి ని ఎంపిక చేశారు. కానీ అత‌డు కాల్షీట్లు స‌ర్ధుబాటు చేయ‌లేక‌.. ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేస్ ని నాగ‌చైత‌న్య‌తో రీప్లేస్ చేయాల‌ని అమీర్ భావిస్తున్నార‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే చైతూ జాక్ పాట్ కొట్టేసిన‌ట్టే. మిస్ట‌ర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అంత‌టి వాడి సినిమాలో న‌టించే అవ‌కాశం చాలా అరుదైన‌ది. దీంతో చైత‌న్య‌కు అటు హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ గుర్తింపు ద‌క్కుతుంది.

నాగ‌చైత‌న్య ప్రస్తుతం విక్ర‌మ్ కె కుమార్ తెర‌కెక్కిస్తున్న థాంక్యూలో న‌టిస్తున్నాడు. క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలోని ల‌వ్ స్టోరి రిలీజ్ కి రానుంది. వీటితో పాటు ప‌లు చిత్రాల‌కు క‌మిట‌య్యాడు. అటు బాలీవుడ్ లోనూ ఆరంగేట్రం చేస్తే అది అత‌డికి ఎంతో పెద్ద ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News