చైతన్య అప్పుడే మిస్సెస్ అంటున్నాడే

Update: 2017-01-21 17:13 GMT
ఆల్రెడీ నాగ్ చైతన్య అండ్ సమంతలు హైదరాబాద్ లో ఒకటే ఫ్లాటులో కలిసే ఉంటున్నారని టాక్ ఉండనే ఉంది. ఇకపోతే ఈ నెల 29న ఇద్దరికీ నిశ్చితార్దం కూడా జరగనుందని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ తరుణంలో చైతన్య ఒక మాంచి కామెంట్ చేశాడు. ఓ విధంగా చూస్తే సంచలనం రేపేశాడు. ఆల్రెడీ వీళ్లకు పెళ్ళయిపోయిందా అనే సందేహం తెచ్చేశాడు.

ఈరోజు ఉదయం నయా ఢిల్లీలోని ఒక కార్ రేసింగ్ కోర్సులో రేస్ కార్ డ్రైవ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడి టెస్ట్ ట్రాక్స్ లో మనోడు ఎప్పుడూ రేసింగ్ చేస్తూనే ఉంటాడులే. చిన్నప్పటి నుండీ ఈ రేసులంటే మనోడికి చాలా ఇష్టం కదా.. అందుకే ఇప్పుడు అవన్నీ సమంతకు కూడా పరిచయం చేయిస్తున్నట్లున్నాడు. అక్కడే రేసింగ్ చేస్తున్నప్పుడు.. మనోడినీ మనోడి కారును ఒక ఫోటో తీసి.. దానిని ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఈ పిక్చర్ నా మిస్సెస్ తీసింది అంటూ చెప్పాడు. మామూలుగా పెళ్ళయ్యాక అలాగే పిలుస్తారులే.. కాని ఎంగేజ్మంట్ కూడా అవ్వక మునుపే మనోడు ఇలా మిస్సెస్ అనేయడంతో అందరూ ఆశర్యపోతున్నారు.

సర్లేండి.. ఇద్దరూ కూడా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు కాబట్టి.. ఎలా పిలుచుకున్నా ఓకే. ఇంతకీ ఆ పెళ్ళి డేటు ఎప్పుడో ప్రకటించడమ్మా హాట్ కపుల్!!
Tags:    

Similar News