క్రిమినల్స్ ని వేటాడటానికి బయలుదేరిన నాగ్ 'వైల్డ్ డాగ్' టీమ్..!

Update: 2020-10-29 15:50 GMT
'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వైల్డ్‌ డాగ్''. వాస్తవ సంఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ జరుగునున్న ఈ చిత్రాన్ని కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ప్రధాన తారాగణంతో హిమాచల్‌ ప్రదేశ్‌ లోని మనాలి ప్రాంతంలో జరుగుతోంది. మనాలిలోని రోహతంగ్ పాస్ లో దాదాపు 13వేల అడుగుల ఎత్తులో జీరో డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల్లో డేంజరస్ ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ జరుపుతున్నారు. తాజాగా నాగార్జున 'వైల్డ్ డాగ్' టీమ్ తో హిమాలయాల్లో సంచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశాడు.

ఈ సందర్భంగా నాగార్జున ట్వీట్ చేస్తూ ''హిమాలయాలలో తన బృందంతో వైల్డ్ డాగ్ !! లవింగ్ ఫ్రీడమ్.. లవింగ్ నేచర్'' అని పేర్కొన్నాడు. నాగ్ షేర్ చేసిన ఈ ఫోటోలలో 'వైల్డ్ డాగ్' టీమ్ చేతిలో వెపన్స్ పట్టుకొని క్రిమినల్స్ ని వేటాడటానికి వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు. నాగార్జునతో పాటు బాలీవుడ్ బ్యూటీ సయామి ఖేర్ - 'బిగ్ బాస్' ఫేమ్ అలీ రెజా - స్టాంటప్ కమెడియన్ మయాంక్ ప్రకాష్ కనిపిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాగ్ 'వైల్డ్‌ డాగ్' ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ భామ దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిమాలయాల్లో జరిగే 21 రోజుల షెడ్యూల్‌ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. 'మన్మథుడు 2' వంటి ప్లాప్ సినిమా తర్వాత నాగ్ నుంచి వస్తున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Tags:    

Similar News