ఓటీటీ బిజినెస్ లోకి రావాలని చూస్తున్న నాగ్ అండ్ వెంకీ ఫ్యామిలీస్..!
డిజిటల్ వరల్డ్ లో ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవా నడుస్తోంది. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లకు వెళ్లే ఆడియన్స్.. ఇప్పుడు చేతిలో ఉన్న మొబైల్ లో కొత్త కొత్త సినిమాలను చూసేస్తున్నారు. మారుతున్న కాలంతో పాటుగా అడ్వాన్సుడ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సినిమా వీక్షణలోనూ మార్పులు వచ్చాయని చెప్పవచ్చు. దీనికి అనుగుణంగానే అందరూ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ తో పాటుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి అంటూ సరికొత్త ఓటీటీలు పుట్టుకొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రాంతీయ ఓటీటీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో వెబ్ కంటెంట్ దే రాజ్యమని ముందుగానే గ్రహించిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. 100 శాతం తెలుగు కంటెంట్ తో 'ఆహా' ఓటీటీకి శ్రీకారం చుట్టారు. లేటెస్టుగా యువ పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు కూడా నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి 'స్పార్క్' అనే ఓటీటీకి లాంచ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు కింగ్ అక్కినేని నాగార్జున మరియు దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీస్ ఓటీటీ బిజినెస్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తన ఆలోచనలతో మారుతూ వచ్చే నాగార్జున ఓటీటీ రంగంలోకి రానున్నారని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సినిమా నిర్మాణాలు.. అన్నపూర్ణ స్టూడియోస్ తోపాటు యాక్టింగ్ స్కూల్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తోన్న నాగార్జున.. ఇప్పుడు డిజిటల్ రంగంలో రాణించడానికి దగ్గుబాటి ఫ్యామిలీ హెల్ప్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ఓటీటీతో సురేశ్ బాబు భారీ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు అక్కినేని అండ్ దగ్గుబాటి ఫ్యామిలీస్.. ఓ బాంబే టీమ్ తో కలిసి కొత్త ఓటీటీని సిద్ధం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
కంటెంట్ కూడా వారే తయారుచేసుకుని అందులోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ స్థాపనలో ఈ రెండు ఫ్యామిలీస్ తో పాటుగా మరికొందరు స్నేహితులు కూడా భాస్వామ్యులుగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా దశాబ్దాలుగా అనుబంధం ఉన్న ఈ రెండు కుటుంబాలు కొత్త ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ క్రియేట్ చేస్తున్నారనే వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.