• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆరవ అర్జున్ రెడ్డి సంగీతం...

ఆరవ అర్జున్ రెడ్డి సంగీతం అతనే

By - Tupaki Desk
Update: 2018-07-24 13:09 GMT
విజయ్ దేవరకొండ హీరోగా గత ఏడాది వచ్చిన అర్జున్ రెడ్డి తాలూకు ప్రభావం ఇంకా యూత్ ని వెంటాడుతూనే ఉంది. ప్రేమ కథల్లో ఒక డిఫరెంట్ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయిన ఆ సినిమా ఇప్పుడు హిందీతో పాటు తమిళ్ లో కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హిందీలో సీనియర్ హీరో షాహిద్ కపూర్ నటిస్తుండగా తమిళ్ లో విక్రమ్ వారసుడు ధృవ్ ని బాలా దర్శకత్వంలో దీని ద్వారానే లాంచ్ చేయబోతున్నారు. ఎక్కువ అప్  డేట్స్ బయటికి ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్న బాలా టీమ్ తాజాగా సంగీత దర్శకుడిని కూడా ఫిక్స్ చేసేసింది. తెలుగు వెర్షన్ కు సంగీతం అందించిన రాదన్ నే తమిళ్ వెర్షన్ కు కూడా తీసుకున్నారు. కాకపోతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన హర్షవర్ధన్ రామేశ్వర్ ని పిలుస్తారా లేదా అనే సంగతి మాత్రం తేలలేదు. మేఘా చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పుడు రెండో షెడ్యూల్ లో ఉంది. వర్మ అనే  టైటిల్ షూటింగ్ కి ముందే ఫిక్స్ చేసారు. మార్పు ఉండకపోవచ్చు.

తెలుగులో వచ్చిన ఫీల్ మిస్ కాకుండా తమిళ నేటివిటీకి తగ్గట్టు స్వల్ప మార్పులతో బాలా తనదైన టేకింగ్ తో దీన్ని తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. మామూలుగానే బాలా సినిమాలు ఎవరికి సాధ్యం కానంత బోల్డ్ గా ఉంటాయి. ఆయన ప్రత్యేకత కూడా అదే. అలాంటిది అర్జున్ రెడ్డి లాంటి కథ దొరికితే ఇక చెప్పేదేముంది. కాలాలో రజనీకాంత్ సరసన మెప్పించిన తెలుగు సీనియర్ నటి ఈశ్వరి రావు ఇందులో హీరో నాన్నమ్మగా కనిపిస్తుండగా బిగ్ బాస్ ద్వారా పేరు తెచ్చుకున్న రైజాను మరో కీలక పాత్ర కోసం తీసుకున్నారు. వర్మ మీద ఇప్పటికే కోలీవుడ్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. మనం చూసేసిన కథ కాబట్టి డబ్బింగ్ కాకపోవచ్చు. రాదన్ ఇప్పుడు వర్మ కోసం ఫ్రెష్ ట్యూన్స్  ఇస్తాడా లేదా సాధారణంగా రీమేకులు పాటించే సంప్రదాయం ప్రకారం ఒరిజినల్ వే ఇస్తాడా అనేది  ఇంకా తెలియాల్సి ఉంది. ధృవ్ ని తెలుగులో కూడా పరిచయం చేసే ప్లాన్ లో ఉన్నాడు విక్రమ్. అది రెండో సినిమాతోనే జరుగుతుందని  ప్రత్యేకంగా చెప్పాలా.
Tags:    
  • Music director Radhan 
  • Bala 
  • Varma 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS