• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిందీలో ‘చిరు 150’.. హీరో...

హిందీలో ‘చిరు 150’.. హీరో ఎవరంటే?

By - Tupaki Desk
Update: 2017-02-26 08:32 GMT
ఎప్పుడో రెండున్నరేళ్ల కిందట వచ్చిన సినిమా ‘కత్తి’. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రానికి బోలెడన్ని రీమేక్ ఆఫర్లు వచ్చాయి. కానీ ఏవీ కూడా వెంటనే కార్యరూపం దాల్చలేదు. తెలుగులో ‘కత్తి’ రీమేక్ హీరోలుగా పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ ల పేర్లు వినిపించాయి కానీ.. వాళ్లిద్దరూ ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపించలేదు. చివరికి మెగాస్టార్ చిరంజీవి తన రీఎంట్రీకి ఈ రీమేక్ నే ఎంచుకున్నారు. మంచి ఫలితం సాధించారు. మరోవైపు తన బ్లాక్ బస్టర్ మూవీస్ గజిని.. తుపాకిలను హిందీలో స్వయంగా రీమేక్ చేసిన మురుగదాస్.. ‘కత్తి’ని కూడా హిందీలోకి తీసుకెళ్లాలని ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాడు. సల్మాన్ ఖాన్.. అక్షయ్ కుమార్ లాంటి వాళ్లను సంప్రదించాడు కూడా. కానీ వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.

ఐతే ఇప్పుడు ‘కత్తి’ రీమేక్ కోసం మురుగదాస్ కు హీరో దొరికేసినట్లు సమాచారం. హృతిక్ రోషన్ ఈ రీమేక్ లో నటించడానికి ఓకే చెప్పాడట. ఈ మధ్యే అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు సమాచారం. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి మురుగదాసే హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ రచయితలు అక్కడి నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ‘కత్తి’ రీమేక్ తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయ్యేసరికి హృతిక్ ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. మొహెంజదారో.. కాబిల్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఎదురుదెబ్బలు తిన్న హృతిక్.. ‘కత్తి’ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ చేసి కెరీర్ ను చక్కదిద్దుకోవాలని చూస్తున్నట్లున్నాడు. మహేష్ బాబు చిత్రం తర్వాత మురుగదాస్ చేసే ప్రాజెక్టు ఇదే కావచ్చని సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Murugadoss 
  • Kaththi Remake 
  • Hrithik Roshan 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS