సన్నీలియోన్ భర్తతో ఆడుకున్న యువకుడు అరెస్ట్!

Update: 2021-02-27 14:30 GMT
శృంగారతార సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఓ యువకుడు సన్నీలియోన్ భర్త డేనియల్ ను బాగా పరేషాన్ చేసాడట. మాములుగా సెలబ్రిటీలు చెప్పే బ్యూటీ టిప్స్ లేదా డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ కట్ ఇలాంటివి ఫ్యాన్స్ ఫాలో అవ్వడం చూస్తూనే ఉంటాం. కానీ సెలబ్రిటీల కారు నెంబర్ కూడా కాపీ కొట్టేవారు ఎక్కడా కనిపించరు. ఎందుకంటే ఒకే కంపెనీ కారు కొంటారేమో గాని కార్ నెంబర్ మాత్రం ఒకేలా ఉండదు. ఇప్పుడు డేనియల్ అలాంటి సమస్యనే చేధించాడు. పీయుష్ సేన్ అనే ఓ ముంబై యువకుడు సన్నీలియోన్ భర్త కారు నెంబర్ ను తన కారుకు పెట్టుకుని నగరం మొత్తం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి డేనియల్ పేరు బయటికి వచ్చేలా చేసాడు.

ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ఫైన్స్ వేసినా ఆ కారు అలా తిరుగుతూనే ఉండటంతో షాకయ్యారట. అయితే ఇటీవల డేనియల్ డ్రైవర్ అక్బర్ ఖాన్.. బాస్ లాంటి అచ్చం బాస్ కారు నెంబర్ కనిపించేసరికి వెంటనే ముంబై ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించాడట. మొత్తానికి నెంబర్ తో ఆ కారును పోలీసులు గుర్తించారు. అయితే ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి పీయుష్ సేన్. తన మెర్సిడెస్ కారుకి నెంబర్ తగలించుకొని విచ్చలవిడిగా షికార్లు కొడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిజానికి ఫైన్స్ అన్ని డేనియల్ ఖాతాలో పడ్డాయట. ఇక తాజాగా విచారణ అనంతరం పోలీసులు పీయుష్ కారు పత్రాలను, డేనియల్ కారు పత్రాలను పరిశీలించారు. అయితే నిజమేంటో గుర్తించి పోలీసులు పీయుష్ ను అరెస్ట్ చేశారు. మొత్తానికి సన్నీకి తన భర్త డేనియల్ కు మాత్రం ఆ యువకుడు తలనొప్పి తెప్పించాడనే చెప్పాలి.
Tags:    

Similar News