ధోనీ నటుడి అంత్యక్రియలు నిలిపివేత..!
'ఎంఎస్ ధోని' 'కేసరి' వంటి చిత్రాల్లో నటించిన సందీప్ నహర్ సోమవారం ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. సందీప్ చనిపోయే ముందు తన ఫేస్ బుక్ పేజీలో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ 'తనకు తన భార్యకు విభేదాలున్నాయని.. అయితే తన మరణానికి ఆమె కారణం కాదని.. తన మరణం తర్వాత భార్య కంచన్ ను నిందిచవద్దని' కోరాడు. పోలీసులు ఈ వీడియోను సూసైడ్ నోటుగా పరిగణిస్తున్నారు. అయితే ఈ కేసులో సందీప్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో ఇది మరో మలుపు తిరిగే అవకాశం ఉంది.
సందీప్ కుటుంబ సభ్యులు అతని మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ 'సందీప్ ను ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించారంటూ' భార్య కంచన్ మరియు ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా సందీప్ నహార్ మరణించి మూడు రోజులవుతున్నా అంత్యక్రియలు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. అతని మృత దేహానికి వైద్యులు నిర్వహించిన పోస్టు మార్టం రిపోర్టులు అందకపోవడంతో అంత్యక్రియలను నిలిపివేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోస్టు మార్టం రిపోర్టు అందిన తర్వాత హర్యానాలోని స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.