• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  30 ప్లస్ హీరోయిన్లకు...

30 ప్లస్ హీరోయిన్లకు దానికి టైం లేదా...?

By - Tupaki Desk
Update: 2020-08-18 17:30 GMT
సినీ ఇండస్ట్రీలోని ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి ద్రుష్టి పెళ్లీడు దాటిపోయిన హీరోయిన్స్ మీద పడింది. సాధారణంగా అమ్మాయిలకు పాతికేళ్లు వస్తే అందరూ ముందు అడిగే ప్రశ్న పెళ్లెప్పుడు అని.. ఇక హీరోయిన్స్ కాబట్టి 30 ఏళ్ల వరకు కూడా పెళ్లికి ఛాన్స్ ఉంటుంది. కానీ టాలీవుడ్ హీరోయిన్స్ చాలామంది హీరోయిన్స్ మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఆ లిస్ట్ లో స్టార్ హీరోయిన్ అనుష్క ఒకరు. 'సూపర్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క ప్రస్తుత వయస్సు 38 ఏళ్ళు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అనుష్క.. ఇప్పటి వరకు పెళ్లి గురించి మాట్లాడలేదు. 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ దేవసేనకి పెళ్లి ఆలోచన రావడం లేదా అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే అప్పట్లో ఓ స్టార్ హీరోతో రొమాన్స్ చేసిందని.. ఇటీవల ఓ ప్రముఖ క్రికెటర్ ని పెళ్లి చేసుకోబోతోందని.. ఓ డైరెక్టర్ తో ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఇలా అనుష్క మ్యారేజ్ పై రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అనుష్క మాత్రం తన పెళ్లి పుకార్లపై క్లారిటీ ఇవ్వలేదు.

మరో హీరోయిన్ త్రిష కూడా ఈ లిస్టులో ఉంది. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళవుతున్నా ఇప్పటికీ అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ప్రొఫెషన్ పరంగా సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న 37 ఏళ్ళ త్రిష పర్సనల్ లైఫ్ సంగతేంటని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి అప్పట్లో వరుణ్ అనే బిజినెస్ మ్యాన్ తో కొంతకాలం పాటు డేటింగ్ చేసిన త్రిష అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కొన్ని రోజుల్లో పెళ్లి అనగా ఏం జరిగిందో ఏమో ఇద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పటి వరకు దీనికి కారణం మాత్రం వెల్లడించలేదు. ఆ తరువాత త్రిషని ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా కూడా సమాధానం దాటవేస్తూ వచ్చింది. అయితే ఇటీవల హీరో శింబుని పెళ్లాడింది అనే న్యూస్ స్ప్రెడ్ అయింది. దీనిపై అమ్మడు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

లేడీ సూపర్ స్టార్ నయనతార మూడుపదుల వయసు దాటి 5 ఏళ్లవుతోంది. ఈ వయసులో కూడా ఇప్పటికీ చెరిగిపోని అందంతో అందరిని కట్టిపడేస్తుంది. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తగత జీవితంతో కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వచ్చింది నయన్. ఇంతకముందు హీరో శింబు తో కొన్నాళ్ళు రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ అతనితో బ్రేకప్ చేసుకుంది. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో కొన్నాళ్ళు డేటింగ్ చేసిన నయన్.. పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని అందరూ అనుకుంటున్న సమయంలో రిలేషన్ షిప్ కి టాటా చెప్పింది. ప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో సహజీవనం సాగిస్తోంది నయన్. వీరి పెళ్లి ఫై రోజొక వార్త వస్తూనే ఉంది. మరి ఈ బంధమైనా పెళ్లి పీటల దాకా వస్తుందేమో చూడాలి.

ఇక చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే 34వ ఏట అడుగుపెట్టింది. కొత్త హీరోయిన్స్ కి పోటీగా ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే ఈ మధ్య కాజల్ ఓ పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకోబోతోందని.. వచ్చే ఏడాది పెళ్లి వేడుక ఉండే అవకాశం ఉందని.. దీనిపై త్వరలోనే ఇరు కుటుంబాలు అధికారిక ప్రకటన చేయనున్నామని పుకార్లు షికారు చేసాయి. అయితే ఈ వార్తలపై అమ్మడు మాత్రం స్పందించలేదు. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చిన నేపథ్యంలో ఈ భామ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో అని అందరూ ఆలోచనలో పడ్డారు.

లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ 34 ఏళ్ళు దాటిపోయాయి. మైకేల్ కార్ సేల్ అనే బ్రిటిషర్ తో అమ్మడు డేటింగ్ చేస్తోందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టే శృతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ చాలాసార్లు కనిపించింది. ఈ క్రమంలో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శృతి హాసన్.. ఈ మధ్య అతనితో బ్రేకప్ చెప్పి కెరీర్ మీద ఫోకస్ చేసిందని అనుకుంటున్నారు. మరి త్వరలోనే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకుంటదేమో చూడాలి.

మరో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా ముప్పైలో అడుగుపెట్టింది. 16 ఏళ్లకే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన మిల్కీ బ్యూటీ పెళ్లి ఎప్పుడని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 15 ఏళ్ళ సినీ కెరీర్ కంప్లీట్ చేసుకున్న తమన్నా.. ఇప్పటికి వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ అదరగొడుతోంది. కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ త్వరలోనే పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆలోచిస్తుందేమో చూడాలి. వీరితో పాటు ఇండస్ట్రీలో 30 ప్లస్ దాటినా పెళ్లి చేసుకొని హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. మరి ఈ బ్యూటీస్ అందరూ ఎప్పుడు పెళ్లి న్యూస్ చెప్తారా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    
  • Tollywood 
  • Heroines 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS