పారితోషికాల కోత‌.. మన హీరోలు నోరెత్త‌రేం?

Update: 2020-06-04 03:30 GMT
ఇటీవ‌లి కాలంలో ఇండ‌స్ట్రీలో విస్త్ర‌తంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన టాపిక్ పారితోషికాల కోత‌. ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీ క్రైసిస్ లో అంత‌కుమించి నిర్మాత‌కు వేరొక మార్గం లేద‌న్న‌ది అంద‌రి వ్యూ ఆఫ్ పాయింట్. బ‌డ్జెట్లు త‌గ్గాలంటే పారితోషికాల త‌గ్గింపు అన్న‌ది త‌ప్ప‌నిస‌రి. అయితే అందుకు మ‌న స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారా? అంటే ఇప్ప‌టి వ‌ర‌కూ పెద‌వి విరుపులే క‌నిపిస్తున్నాయి.

మహమ్మారి కారణంగా మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ గత రెండు నెలల నుండి ఎలాంటి రిలీజ్ లు లేక  షూటింగులు లేక నానా ఇబ్బందులు ప‌డుతోంది. థియేటర్లు తెరిచి.. షూటింగులు పునః ప్రారంభించిన తరువాతా వైరస్ విల‌యం ఇంకా కొన‌సాగే ప‌రిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ స‌హా అన్నిచోట్లా షూటింగుల హ‌డావుడి క‌నిపిస్తోంది. అయితే మ‌రోవైపు భ‌యం నీడ‌లాగా వెన్నాడుతూనే ఉంది.

అంటే దీన‌ర్థం.. షూటింగ్ స‌వ్యంగా జ‌రుగుతుందా లేదా? అన్న సందేహం  అంద‌రిలో ఎలానూ ఉండ‌నే ఉంటుంది. ఆ త‌ర్వాతా రిలీజ్ స‌రిగా జ‌రుగుతుందా లేదా? అన్న  సందిగ్ధ‌త నిర్మాత‌ల్లో అలానే స‌జీవంగా ఉంది. ఇలాంటి సంక్షోభ స‌మ‌యంలోనే మ‌న హీరోలు నిర్మాత‌ల్ని ఆదుక‌నేందుకు ముందుకు వ‌స్తారా? అన్న టాపిక్ ప‌దే ప‌దే వేడెక్కిస్తోంది. అయినా హీరోల వైపు నుంచి ఎలాంటి స్ప‌ష్ఠ‌తా లేనే లేదు. పారితోషికం త‌గ్గించుకుంటున్నా అంటూ ఒక్క‌రంటే ఒక్క‌రూ కూడా ముందుకు రాలేదు. స‌రిక‌దా .. ఆ టాపిక్కే త‌మ‌కు చెంద‌నిది అన్న‌ట్టుగా లైట్ తీస్కున్నారు.

అయితే ఇలాంటి టైమ్ లో మాలీవుడ్ కి చెందిన ఇద్ద‌రు సూప‌ర్ స్టార్లు తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. మాలీవుడ్ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్.. మెగాస్టార్ మమ్ముట్టి స్వచ్ఛందంగా పారితోషికాల త‌గ్గించుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు తాము న‌టించే సినిమాల‌ నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారు. ఇది అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు స్ఫూర్తినివ్వాలి. మ‌న హీరోల్లో కూడా మార్పు రావాల‌ని ఆకాంక్షిద్దాం. వంద‌మందికి అన్నం పెట్టే నిర్మాత బావుంటేనే ప‌రిశ్ర‌మ బావుంటుంది. త‌ద్వారా అంద‌రికీ ఉపాధి మిగులుతుంది. మ‌రి ఆ ప‌నికి భారీ పారితోషికాలు అందుకునే మ‌న స్టార్ హీరోలు.. ఆర్టిస్టులు .. ద‌ర్శ‌కులు సై అంటారా లేదా?  చూడాలి.
Tags:    

Similar News