మెగా మలయాళ రీమేక్ ని తమిళ డైరెక్టర్ చేతిలో ఎందుకు పెట్టాడంటే..!

Update: 2020-12-18 14:30 GMT
రీమేక్ సినిమాతో సాలిడ్ రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మరో రెండు రీమేక్ సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' ఒకటి. మోహన్ లాల్ హీరోగా పృథ్విరాజ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'లూసిఫర్' సినిమా అక్కడ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా రీమేక్ రైట్స్ రామ్ చరణ్ తీసుకున్నాడని తెలిసినప్పటి నుంచి దీనిపై రోజుకో రూమర్ వస్తూనే ఉంది. ప్రస్తుతం 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి.. ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్ ని అధికారికంగా ప్రకటించి రూమర్స్ కి చెక్ పెట్టారు. రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ‘ధ్రువ’ చిత్రానికి మాతృక ‘తనిఒరువన్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన మోహన్‌ రాజా ఈ మెగా రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్ ని కొణిదెల ప్రొడక్షన్స్‌ మరియు ఎన్వీఆర్‌ సినిమా బ్యానర్స్ పై రామ్ చరణ్ - ఎన్వీ ప్రసాద్‌ నిర్మించనున్నారు. సంక్రాంతి తర్వాత సెట్స్‌ పైకి తీసుకెళ్లి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు అనేకమంది స్టార్ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చిన నేపథ్యంలో చిరు ఈ సినిమాని మోహన్‌ రాజా చేతిలో ఎందుకు పెట్టాడో అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

'లూసిఫర్‌' తెలుగు రీమేక్ బాధ్యతలు ముందుగా యువ దర్శకుడు సుజీత్ కి అప్పగించారు. అయితే సుజీత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ పేరు వినిపించింది. చివరకు మోహన్ రాజా చేతిలోకి వెళ్ళింది. రీమేక్ స్పెషలిస్ట్ గా పిలవబడే మోహన్ రాజా.. తెలుగులో హిట్ అయిన 'జయం' 'అమ్మ నాన్నా ఓ తమిళ అమ్మాయి' 'బొమ్మరిల్లు' వంటి చిత్రాలను సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేశాడు. అలానే 'తనివరువన్' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. అందుకే అప్పుడెప్పుడో 'హనుమాన్ జంక్షన్' సినిమాని డైరెక్ట్ చేసిన మోహన్ రాజాకి అవకాశం ఇచ్చారు. ఇంతకముందు చిరంజీవి 'హిట్లర్' సినిమాకి రాజా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా కూడా వర్క్ చేసియున్నారు. అంతేకాకుండా మలయాళ 'లూసిఫర్‌' ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మోహన్‌ రాజా చేసిన మార్పులు చేర్పులు.. అలానే ఆయన స్క్రిప్ట్ చెప్పిన విధానం నచ్చడంతో మెగాస్టార్ ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చాడని తెలుస్తోంది. మరి ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.
Tags:    

Similar News