• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా152 పుకార్లకు ఫుల్‌...

మెగా152 పుకార్లకు ఫుల్‌ స్టాప్‌

By - Tupaki Desk
Update: 2020-02-13 09:15 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రంపై వస్తున్నని వార్తలు ఈమద్య కాలంలో ఏ సినిమాలకు కూడా రావడం లేదు. హీరోయిన్‌ విషయం.. కథ విషయం.. రామ్‌ చరణ్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌.. ఐటెం సాంగ్‌.. విజయశాంతి అంటూ.. మోహన్‌ బాబు అంటూ వార్తలు సోషల్‌ మీడియాను ముంచెత్తుతున్నాయి. చిరంజీవి 152వ చిత్రంకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో చిన్న వార్త కూడా చాలా ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది. మోహన్‌ బాబు మెగా 152లో నటించబోతున్నాడు అంటూ వచ్చిన వార్త ఏ స్థాయిలో ట్రెండ్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మోహన్‌ బాబు ఈ లుక్‌ లో చిరు 152 చిత్రంలో నటించబోతున్నాడు అంటూ ఒక ఫొటో కూడా వైరల్‌ అయ్యింది. ఈ విషయమై రెండు వారాలుగా వస్తున్న వార్తలకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఫుల్‌ స్టాప్‌ పెట్టేశారు. ఇంకా ఆలస్యం చేస్తే బాగోదనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ వచ్చింది. మోహన్‌ బాబు తమ సినిమాలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పుకొచ్చారు. మోహన్‌ బాబు గారిని అసలు ఈ చిత్రం కోసం సంప్రదించలేదు.. ఆయనకు తగ్గ పాత్ర మా సినిమాలో లేదంటూ క్లారిటీ ఇచ్చారు.

మోహన్‌ బాబు గతంలో వరుసగా చిత్రాలు చేసినా ఈమద్య కాలంలో కాస్త స్లో అయ్యాడు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో చిరంజీవి సినిమాలో ఈయన నటించబోతున్నాడు అనగానే అంతా చాలా సంతోషించారు. వీరిద్దరి కాంబో గతంలో చాలా ఫేమస్‌. ఇప్పుడు మళ్లీ వారిని ఒకే స్క్రీన్‌ పై చూడబోతున్నందుకు చాలా ఆనందించారు.

కాని వారి ఆనందం మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది. మోహన్‌బాబు ప్రస్తుతానికి చిరంజీవి సినిమాలో నటించడం లేదు. వీరిద్దరి మద్య గతంలో విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అదేమి లేదు మీమిద్దరం మంచి స్నేహితులం అంటూ ఇటీవల పలు వేదికల మీద ఆలింగనం చేసుకుని మరీ నిరూపించారు. కనుక ఇద్దరు కలిసి నటించడం నిజమే అనుకున్నారు. కాని అవి కేవలం పుకార్లే అని తేలిపోయింది.
Tags:    
  • Mohan Babu not part of Chiru 152 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily NewsTupaki News 
  • Tupaki Updates 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS