న్యాచురల్ స్టార్ కోసం ఆ హీరోయిన్

Update: 2019-01-15 08:16 GMT
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు.  ఈమధ్యే రిలీజ్ అయిన 'జెర్సీ' టీజర్ అందరినీ మెప్పించింది.  ఇదిలా ఉంటే నాని ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాను కూడా ఫైనలైజ్ చేసిన సంగతి తెలిసిందే.  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని తన నెక్స్ట్ సినిమాను చేస్తాడు.   ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది.

ప్రీ-ప్రొడక్షన్ జోరుగా జరుపుకుంటున్న ఈ సినిమాకు విక్రమ్ ఇప్పుడు హీరోయిన్.. ఇతర నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట.  ఈ సినిమాలో నానికి జోడీగా మేఘా ఆకాష్ ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట.  ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయట. దాదాపుగా మేఘానే ఫైనలైజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.  నితిన్ తో మేఘా 'లై'.. 'చల్ మోహన్ రంగా'  సినిమాల్లో నటించింది.  కానీ రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపుగా నిలిచాయి.  ఆ ఫలితాలతో సంబంధం లేకుండా ఈ అవకాశం వస్తే మేఘాను లక్ ఫుల్ గా ఉందని అనుకోవచ్చు.  మేఘా ప్రస్తుతం కొన్ని తమిళ సినిమాలో నటిస్తోంది.

నాని-విక్రమ్ సినిమాను  మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తారు.  ఈ సినిమాకు లేజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసి శ్రీరామ్ పనిచేస్తారు.  'జెర్సీ' షూటింగ్ పూర్తికాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. నాని మొదటి సారి విక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తుండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా భారీ ఆసక్తి వ్యక్తం అవుతోంది.
Tags:    

Similar News