• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #మెగా వెడ్డింగ్ .. NBK కి...

#మెగా వెడ్డింగ్ .. NBK కి చిరు ఆహ్వానం?

By - Tupaki Desk
Update: 2020-12-06 08:20 GMT
ఈనెల 9న మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లో అత్యంత వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. దేశంలోనే అత్యంత విలాస‌వంత‌మైన‌ ఉద‌య్ ప్యాలెస్ భ‌వంతిలో ఈ వివాహం జ‌ర‌గ‌నుండ‌డంతో క‌ళ్ల‌న్నీ అటువైపే ఉన్నాయి.

ఈ వేడుక‌కు ఎటెండ‌వుతున్న టాప్ గెస్ట్స్ లిస్ట్ పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతున్నాయి. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఈ వివాహానికి ప్ర‌త్యేక అతిథిగా హాజ‌రు కానున్నార‌ని ఆయ‌న‌కు నాగ‌బాబు త‌ర‌పున శుభ‌లేఖ అందింద‌ని చెబుతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ఫోన్ చేసి త‌న మిత్రుడైన బాల‌కృష్ణ‌ను ఆహ్వానించార‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది.

ఇక ఈ పెళ్లిలో టాప్ 10 గెస్టుల్లో ఇండ‌స్ట్రీ త‌ర‌పున ప్ర‌ముఖులు ఉన్నారు. ఇండ‌స్ట్రీ అగ్ర హీరోలు బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున‌లకు చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి తన సోదరుడు కుమార్తె వివాహానికి హాజ‌రు కావాల్సిందిగా ఆహ్వానించార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. వ‌రుణ్ పిలుపు మేర‌కు రానా-నితిన్- నాగ‌చైత‌న్య ఫ్యామిలీస్ తో అటెండ్ కానున్నారు. క‌థానాయిక‌ల్లో పూజా హెగ్డే-ర‌ష్మిక మంద‌న అటెండ‌య్యే వీలుంది. అలాగే కొర‌టాల శివ‌- రాజ‌మౌళి- సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి- ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్రరావు త‌దిత‌రులు అటెండ్ కానున్నార‌ట‌.

నిర్మాత‌ల్లో అనిల్ సుంకర- దానయ్య- దిల్ రాజు- సురేష్ బాబులకు ఆహ్వానాలు అందాయ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఆర్కా మీడియా..యూవీ.. మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలు అటెండ్ కానున్నార‌న్న స‌మాచారం ఉంది.

కుటుంబ హీరోలంతా ఈ వేదిక వ‌ద్ద సంద‌డి చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగుకి బ్రేక్ ఇచ్చి వివాహానికి అటెండ‌వుతారు. ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెళ్లికి రెండు రోజుల ముందు ఉదయ్ పూర్ వెళ్లి మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నాడు. రామ్ చరణ్- అల్లు అర్జున్ షూటింగుల‌కు సెల‌వు పెట్టి వ‌స్తారు.
Tags:    
  • Niharika 
  • Niharika Marriage 
  • Niharika Wedding 
  • Mega Daughter 
  • Chaitanya 
  • Niharika Chaitanya Marriage 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS