పారితోషికంలో మెగాస్టార్ రేంజే వేరులే

Update: 2020-11-18 03:30 GMT
మెగాస్టార్ చిరంజీవి షాకుల మీద షాకులిస్తున్నారు. గ‌తం కంటే భిన్నంగా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికీ టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న చిరు అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. సినిమాల ప‌రంగా ఈ సారి స్పీడు పెంచిన మెగాస్టార్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో షాకిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ‌ల‌ని అంగీక‌రిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

పారితోషికం విష‌యంలోనూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు అభిమానుల్ని విస్మ‌యానికి గురిచేస్తున్నారు. ఏడాదికి ఒకే ఒక్క సినిమా అంటూ ప్రామిస్ చేసిన చిరు ప్ర‌స్తుతం ఒక మూవీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే మ‌రో రెండు చిత్రాల్ని లైన్ ‌లో పెట్టేస్తున్నారు. ఖైదీ నం.150కి గాను 40 కోట్లు పారితోషికం అందుకున్న చిరు తాజాగా న‌టిస్తున్న `ఆచార్య‌` చిత్రానికి 50 కోట్లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ మూవీ త‌రువాత వెంట‌నే త‌మిళ హిట్ ఫిల్మ్ `వేదాళం` రీమేక్ లో న‌టించ‌బోతున్నారు. ఈ చిత్రానికి మెహెర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఏకే ఎంట‌ర్ టైన్ ‌మెంట్స్ బ్యాన‌ర్ పై అనిల్ సుంక‌ర ఈ యాక్ష‌న్ డ్రామాని నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రానికి గాను చిరు 60 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నార‌ట‌. చిరు సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురుస్తుంది కాబ‌ట్టి నిర్మాత కూడా ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది.
Tags:    

Similar News