రేసులో వెన‌క్కి నెట్టేంత ద‌మ్ము మెహ‌ర్ కి ఉందా?

Update: 2020-04-22 04:15 GMT
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ అనంత‌రం కెరీర్ ప‌రంగా స్పీడ్ అంత‌కంత‌కు పెంచేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయాల‌కు పూర్తిగా స్వ‌స్థి చెప్పి ఫుల్ టైమ్ సినిమాల‌కే కేటాయిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా సినీప‌రిశ్ర‌మలో పెద్ద‌న్న పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇండ‌స్ట్రీ మేలు కోసం చిరు చేస్తున్న ప‌నుల‌పై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియా ద్వారానూ అంద‌రికీ ట‌చ్ లో ఉంటున్న చిరు .. మీడియా ఇంట‌రాక్ష‌న్స్ తోనూ వేడెక్కించేస్తున్నారు.

అలా ఓ చిట్ చాట్ లో చిరు వ‌రుస‌గా తాను ప‌ని చేస్తున్న ద‌ర్శ‌కుల పేర్లు రివీల్ చేయ‌డంతో మెగా ఫ్యాన్స్ లో పెద్ద డిబేట్ కి తెర తీసింది. ఖైదీ నంబ‌ర్ 150- సైరా న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చిత్రం చేస్తున్న చిరు త‌దుప‌రి క్యూలో సుజీత్-బాబి లాంటి యువ ద‌ర్శ‌కుల‌కు స్కోప్ నిచ్చారు. అయితే ఆ రెండు పేర్ల‌తో పాటు అన‌ధికారికంగా ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్- హ‌రీష్ శంక‌ర్ లాంటి ద‌ర్శ‌కుల పేర్లు లిస్ట్ లో ఉన్నాయి. వీళ్ల‌తో పాటు మెహ‌ర్ ర‌మేష్ పేరును మెగాస్టార్ ప్ర‌క‌టించేయ‌డంతో అభిమానులు ఒక్క‌సారిగా ఖంగు తిన్నారు.

ఇంత‌కీ మెహ‌ర్ కి మెగాస్టార్ అవ‌కాశం ఇస్తారా?  ఇస్తే ప‌రిస్థితేంటి?  డిజాస్ట‌ర్ల ద‌ర్శ‌కుడితో అన్న‌య్య ప‌ని చేయ‌డ‌మేంటి? అంటూ మెగాభిమానులు ఒక‌టే కంగారు ప‌డిపోతున్నారు. అయితే అలాంటి వాళ్లంతా తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. పేరు ప్ర‌క‌టించినంత మాత్రాన సినిమా సెట్స్ కెళ్లిపోతుందా? అదేమీ అంత ఈజీ కాదు. క‌థ చెప్పాలి. బౌండ్ స్క్రిప్టును రెడీ చేయాలి. అంత చేశాకా.. ఫైన‌ల్ గా మెగా స్క్రుటినీకి వెళ్లి 200 శాతం సంతుష్టుల్ని చేయ‌గ‌లిగితేనే ఆఫ‌ర్ ఉన్న‌ట్టు. అంత‌వ‌ర‌కూ వెళ్లాలంటే మెహ‌ర్ ద‌గ్గ‌ర అంత ద‌మ్ముండాలి. అందుకే 90 శాతం మూవీ స్టార్ట్ కాక‌పోవ‌చ్చు అని విశ్లేషిస్తున్నారు కొంద‌రు విశ్లేష‌కులు. కాబ‌ట్టి మెగా ఫ్యాన్స్ మ‌రీ అంత కంగారు ప‌డాల్సిందేమీ లేదు. మెగాస్టార్ ని సంతృప్తి ప‌రిచే క‌థ చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఒక‌వేళ మెగాస్టార్ కి న‌చ్చినా కానీ.. మెహ‌ర్ ర‌మేష్ కి పూర్తి ఫ్రీడ‌మ్ ఇచ్చేందుకు ఆస్కారం లేక‌పోవ‌చ్చు. ఇక మెహ‌ర్ కంటే ముందే న‌లుగురైదుగురు ద‌ర్శ‌కులు క్యూలో ఉన్నారు. వీళ్ల‌ను రేసులో వెన‌క్కి నెట్టేంత ద‌మ్ము మెహ‌ర్ కి ఉందా? అందుకే ఫ్యాన్స్ ఏమాత్రం భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు! అంటూ ఒక‌టే గుసగుస‌గా మాట్లాడుకుంటున్నారంతా.
Tags:    

Similar News