మెగా మదర్ బర్త్ డే ట్రీట్.. చిరు ఎమోషనల్..

Update: 2023-01-29 18:52 GMT
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం.. మెగాస్టార్ చిరంజీవిని అందరూ గౌరవించేలా చేసింది. సినీ ఇండస్ట్రీలో ఆయన్ని అభిమానించని వారంటూ ఉండరు. దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా.. ఆయనా ఓ తల్లికి కొడుకే. అమ్మ అంజనా దేవితో ఆయనది విడదీయరాని బంధం. ఇంట్లో ఖాళీగా ఉంటే అమ్మతోనే ఎక్కువ సమయం గడుపుతారు. స్వయంగా ఆమెకు ఇష్టమైన వంటకాలను చేసి వడ్డిస్తారు. మరి అమ్మతో ఆయనకు ఉన్న అనుబంధం అలాంటిది మరి.

అయితే ఈ రోజు మెగా మదర్ అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. తన తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్, సోదరీమణులతో కలిసి అంజనాదేవి పుట్టినరోజు వేడుకలను జరిపారు. ఈ వేడుకలో రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కూడా పాల్గొని సందడి చేశారు. అందరూ కలిసి కేక్ కట్ చేసుకొని సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరు సోషల్ మీడియా లో షేర్ చేశారు.

'మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ...Happy Birthday అమ్మ' అని వ్యాఖ్య రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు మెగా మదర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

ఇకపోతే మెగా మదర్ అంజనా దేవి, కొణిదెల వెంకట్రావు దంపతులుకు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు విజయలక్ష్మి, మాధవి మొత్తం ఐదుగురు సంతానం. ముగ్గురు మొనగాళ్లను కన్న అమ్మ అంజనా దేవి అంటూ మెగా ఫ్యాన్స్ ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి స్టార్స్‌కు జన్మనిచ్చింది అమ్మ అంజనా దేవి. ఈ మెగా బ్రదర్స్ ముగ్గరు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని కెరీర్ లో ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు. 60 ఏళ్ల వయసులోనూ చిరంజీవి మెగాస్టార్‌గా రాణిస్తే .. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా ఎదిగారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇక నాగబాబు నటుడిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

Similar News