• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పొరుగు రాష్ట్రంలో మెగా...

పొరుగు రాష్ట్రంలో మెగా ఫ్యాన్స్ హంగామా… 

By - Tupaki Desk
Update: 2023-01-13 13:49 GMT
మెగాస్టార్ చిరంజీవి స్టామినా గురించి, ఫ్యాంగ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మెగాస్టార్ కి అభిమానులు ఉంటారు. అలాగే కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలో కర్ణాటక, తమిళనాడులో కూడా మెగాస్టార్ కి ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి అందరికి తెలిసిందే.

ముఖ్యంగా కర్ణాటకలో కన్నడ హీరోలకంటే మెగాస్టార్ ని అభిమానించే వారు ఎక్కువ అనే మాట చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యంగా బెంగుళూరుతో పాటు రాయలసీమకి ఆనుకొని ఉన్న దక్షిణ కర్ణాటకలో మెగాస్టార్ కి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక చిరంజీవి మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు వచ్చినా కూడా భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడంతో ఫ్యాన్స్ సందడి భారీగా ఉంటుంది.

అలాగే మెగా హీరోల సినిమాలకి కర్ణాటకలో కలెక్షన్స్ కూడా భారీగానే ఉంటాయి. ఇదిలా ఉంటే వాల్తేర్ వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఇప్పటికే ట్రైలర్ తో సినిమాలో ఒకప్పటి మాస్ మెగాస్టార్ ని చూడబోతున్నాం అనే విషయం ఫ్యాన్స్ కి కూడా అర్ధమైంది.

దీంతో వాల్తేర్ వీరయ్య సినిమా రిలీజ్ సందర్భంగా మెగా ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో మెగా ఫ్యాన్స్ సందడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే కర్ణాటకలో మెగా ఫ్యాన్స్ చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాల్తేర్ వీరయ్య మెగాస్టార్ 154వ సినిమా అనే సంగతి అందరికి తెలిసిందే.

ఈ నేపధ్యంలో కర్ణాటకలో మెగా ఫ్యాన్స్ ఏకంగా 154 ఆటోలతో మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఫోటోలని ఆటోలకి అతికించి ఈ ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబందించిన వీడియో ఎవరో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. మెగా ఫ్యాన్స్ ఎక్కడ ఉన్న కూడా వారి సందడి వేరే లెవల్ లో ఉంటుందని ఈ వీడియో చూసిన వారు చెబుతూ ఉండటం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Karnataka Mega Fans Huge Rally with 154 Autos. #WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th #Bangalore #karnatka #MegaStarChiranjeevi pic.twitter.com/d89mn7x7Pq

— Pavanheartkiller (@Pavanheartkill1) January 12, 2023
Full View
Tags:    
  • Megafans 
  • WaltairVeerayya 
  • movie 
  • Chiranjeevi 
  • raviteja 
  • latestnews 

Similar News

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS