• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా 152 ఇంట్రెస్టింగ్‌...

మెగా 152 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌

By - Tupaki Desk
Update: 2019-11-15 10:14 GMT
సైరా నరసింహారెడ్డి కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్న మెగాస్టార్‌ తన 152వ చిత్రంను మాత్రం చాలా ఫాస్ట్‌ గా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌ లోనే మెగా 152 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆ చిత్రం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మాత్రం మొదలు పెట్టలేదు. డిసెంబర్‌ నుండి షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది. సినిమా ఇంకా షూట్‌ ప్రారంభం కాకుండానే హడావుడి ఆగం ఆగంగా ఉంది.

చిరు.. కొరటాల మూవీ గురించి గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. సైరా విడుదల తర్వాత సినిమా గురించిన వార్తలు సోషల్‌ మీడియాలో జోరుగా వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం సినిమాకు గోవింద ఆచార్య టైటిల్‌ పెట్టారంటూ ఒక పోస్టర్‌ కూడా వచ్చింది. కాని అది నిజం కాదంటూ నిర్మాణ సంస్థ అఫిషియల్‌ గా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం కోసమని దర్శకుడు కొరటాల శివ 'గోవిందా హరి గోవిందా' అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

కొన్ని రోజులుగా ఈ టైటిల్‌ తెగ సర్క్యులేట్‌ అవుతున్నా కూడా ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఎవరు కూడా ఖండించక పోవడంతో గోవిందా హరి గోవిందా ఖరారు చేసి ఉంటారని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ఆ టైటిల్‌ ను ఫిల్మ్‌ ఛాంబర్‌ లో రిజిస్ట్రేషన్‌ కోసం దరకాస్తు వెళ్లిందంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమా టైటిల్‌ ను ముందే ప్రకటించే ఉద్దేశ్యంతో దర్శకుడు కొరటాల శివ టైటిల్‌ ను కన్ఫర్మ్‌ చేశాడట.

దేవాలయాలు మరియు వాటిల్లో జరుగుతున్న అవినీతిపై పోరాటమే ఈ చిత్రం అంటూ మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంకు తగ్గట్లుగా గోవిందా హరి గోవిందా టైటిల్‌ ను ఖరారు చేశారు అంటూ మెగా కాంపౌండ్‌ లో చర్చ జరుగుతోంది. చిరంజీవి ఈ చిత్రంలో డబుల్‌ రోల్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. ఇక హీరోయిన్స్‌ విషయంలో కూడా ఇప్పటి వరకు వార్తలు రావడమే మినహా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఈ ప్రశ్నలన్నింటికి కూడా వచ్చే నెలలో సినిమా సెట్స్‌ పైకి వెళ్లిన తర్వాత కొరటాల సమాధానం ఇస్తాడేమో చూడాలి.
Tags:    
  • Ram Charan 
  • Eesha Rebba 
  • Chiranjeevi 
  • Koratala Siva 
  • Chiru 152 
  • Tupaki Updates 
  • Tupaki News 

Similar News

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

Copyright @2026

Powered by Blink CMS