• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిన్నదాని దూకుడు ఓ రేంజ్...

చిన్నదాని దూకుడు ఓ రేంజ్ లోనే ఉందే!

By - Tupaki Desk
Update: 2021-03-04 17:30 GMT
తెలుగు తెరకి ఈ ఏడాదిలో పరిచయమవుతున్న కథానాయికలలో మీనాక్షి చౌదరి ఒకరు. పిల్లగాళ్లను రెచ్చగొట్టే అందాలు పుష్కలంగా ఉన్న పిల్లనే. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా ద్వారా క్రితం ఏడాదిలోనే ఈ అమ్మాయి ప్రేక్షకులను పలకరించవలసి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఇంకా థియేటర్లను వెతుక్కుంటూ ఉండగానే మీనాక్షి చౌదరి ఏకంగా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథతో ఈ సినిమా నిర్మితమవుతోంది. 'క్రాక్' వంటి సూపర్ హిట్ తరువాత రవితేజ చేస్తున్న సినిమా కావడంతో,ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండగా, ఒక కథానాయిక కోసం మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే ఈ అమ్మాయి రవితేజ సరసన ఛాన్స్ సంపాదించుకోవడం విశేషంగా చెబుతున్నారు.

ఇక ఈ సినిమా కూడా సెట్స్ పై ఉండగానే ఈ పిల్ల మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. క్రితం ఏడాది విష్వక్సేన్ కథానాయకుడిగా 'HIT' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. నాని నిర్మించిన ఈ సినిమాకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. ఓ మాదిరి బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా సక్సెస్ ను సాధించింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'HIT 2' సినిమాను నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోగా అడివి శేష్ చేయనున్నాడు. ఆయన జోడీగా మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. చూస్తుంటే ఈ అమ్మాయి దూకుడు ఒక రేంజ్ లోనే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కదూ.  
Tags:    
  • Meenakshi Chowdary 
  • Meenakshi Chowdary Latest Movies 
  • Khiladi 
  • Ravi Teja 
  • Telugu News 

Similar News

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

Copyright @2026

Powered by Blink CMS