• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2021 సంక్రాంతి ఫైట్ కి...

2021 సంక్రాంతి ఫైట్ కి `మాస్ట‌ర్` రెడీ.. సెన్సార్ యుఏ ప్ర‌దానం!

By - Tupaki Desk
Update: 2020-12-24 15:05 GMT
2020లో అత్యంత క్రేజీగా అభిమానుల్లో ట్రెండ్ అయిన టైటిల్ `మాస్ట‌ర్`. ద‌ళ‌ప‌తి విజ‌య్ `స‌ర్కార్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టిస్తున్న‌ సినిమాగా ఈ మూవీ గురించి స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఖైదీ లాంటి సంచ‌ల‌న విజ‌యంతో ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ పేరు మార్మోగ‌డంతో ఈ కాంబినేష‌న్ సంథింగ్ స్పెష‌ల్ గా చ‌ర్చ‌ల్లోకొచ్చింది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో నుంచి మాస్ట‌ర్ రిలీజ్ కి వ‌స్తోంది. అత్యంత క్రేజీగా సంక్రాంతి బ‌రిలో బాక్సాఫీస్ వార్ కి తెర‌లేప‌నుంద‌న్న ప్ర‌చారం మొద‌లైంది.

ఈ చిత్రం గురించి విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. తాను అత్యంత క్రూరమైన విలన్ గా కనిపిస్తానని చెప్పారు. కాలేజీ డ్రామా ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని వెల్ల‌డించారు. ఈ చిత్రం ఏడాది క్రితం ప్రకటించినప్పటి నుంచీ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. దీపావళి సందర్భంగా టీజర్ విడుదల చేయ‌గా అది అంతర్జాలంలో సునామీ సృష్టించింది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

తాజాగా సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యుఏ స‌ర్టిఫికెట్ ని ప్రదానం చేసింద‌ని మాస్టర్ నిర్మాతలు స్వ‌యంగా ట్విట్టర్ ‌లో ప్రకటించారు. అతి త్వ‌ర‌లోనే రిలీజ్ తేదీని ప్ర‌క‌టించే వీలుంద‌ని తెలిపారు.

తాజాగా యుఏ మార్క్ తో `మాస్ట‌ర్` పోస్టర్ ‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నిర్మాణ సంస్థ‌ XB ఫిల్మ్ క్రియేటర్స్ త్వ‌రలో కలుద్దాం అంటూ ట్విస్టివ్వ‌డంతో సంక్రాంతి రిలీజ్ ఇంకా క‌న్ఫామ్ కాలేదు. అయితే క‌చ్ఛితంగా సంక్రాంతికే రిలీజ‌వుతుంద‌న్న అంచ‌నా అభిమానుల్లో బ‌లంగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి స‌ర‌స‌న మాళ‌విక‌ మోహనన్ నాయిక‌గా న‌టించింది. ఆండ్రియా జెరోమియా- శాంతను భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2020 వేసవిలో రిలీజ్ కావాల్సి ఉన్నా మహమ్మారి కారణంగా విడుద‌ల‌వ్వ‌లేదు.
Tags:    
  • Master 
  • Vijay 
  • Malavika Mohanan 
  • Lokesh Kangaraj 
  • Vijay Sethupathi 
  • Sensor 
  • U A 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS