రవితేజ మరో 100 కొడితే..

Update: 2023-01-15 07:30 GMT
మాస్ మహారాజ్ వరుసగా  ధమాకా, వాల్తేర్ వీరయ్య సినిమాలతో సూపర్ సక్సెస్ లని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రవితేజ కెరియర్ లో మొదటి సారిగా ధమాకా వంద కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన సినిమాగా నిలిచింది. ఫుల్ లెంత్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో మెప్పించి ఇరగదీసాడు. రొటీన్ స్టొరీ అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు త్రినాధ్ రావు నక్కిన తెరకెక్కించాడు.

దీంతో ధమాకా చాలా రోజుల తర్వాత రవితేజ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి కూడా భాగా కనెక్ట్ అయ్యింది. వెంటనే సంక్రాంతి రేసులో చిరంజీవితో కలిసి వాల్తేర్ వీరయ్య సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా అనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది. మొదటి రోజే 40 కోట్ల వరకు గ్రాస్ ని వాల్తేర్ వీరయ్య రాబట్టింది. ఇక ఈ మూవీకి వస్తున్న పాజిటివ్ బజ్ చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో కచ్చితంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోవడం పక్కా అనే మాట వినిపిస్తుంది.

దీని తర్వాత రవితేజ సుదీర్ వర్మ దర్శకత్వంలో పవర్ ఫుల్ మాస్ రోల్ లో రావణాసురతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాడు. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ తో కచ్చితంగా స్ట్రాంగ్ కంటెంట్ తో సుదీర్ వర్మ రావణాసుర తెరకెక్కిస్తున్నాడు అని అర్ధమవుతుంది.

అలాగే వరుసగా రెండు సూపర్ హిట్స్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో కచ్చితంగా మంచి బజ్ ఉంటుంది. ఒక వేళ రావణాసుర మూవీ కూడా వంద కోట్ల మార్క్ కలెక్షన్స్ ని దాటితే ఇక రవితేజ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా మరిపోయినట్లే. టైర్ 1 హీరోల జాబితాలో తను కూడా చేరిపోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. దీని తర్వాత టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుటున్న ప్రాజెక్ట్ కావడం దాని టార్గెట్ నెక్స్ట్ లెవల్ లో ఉండటం గ్యారెంటీ.
Tags:    

Similar News