సూప‌ర్ హీరోల్ని మించి మార్వెల్ ప్ర‌తిసృష్టి అమోఘం!

Update: 2021-10-19 07:08 GMT
సృష్టికి ప్ర‌తిసృష్టి చేయడం అంటే ఇదే. ఈ లోకంలో సూప‌ర్ ప‌వ‌ర్స్ ఉండి ఉంటే అవి ఎలాంటి అడ్వెంచ‌ర్ల‌ను క్రియేట్ చేస్తాయో ఇప్ప‌టికే మార్వ‌ల్ సినిమాల్లో చూసాం. హాలీవుడ్ సూప‌ర్ హీరోల యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ అవెంజ‌ర్ సిరీస్ ఈ త‌ర‌హానే. ఇది వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంతటి ఆద‌ర‌ణ ద‌క్కించుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మార్కెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్ (ఎంసీయు) నుంచి ఫేజ్-1 .. 2.. 3 అంటూ ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. `ఐర‌న్ మ్యాన్` తో మొద‌లైన అవెంజర్ అటుపై `ది ఇన్ క్రిడిబుల్ హల్క్`...`.ఐర‌న్ మ్యాన్-2`..`థోర్`..`ది ఫ‌స్ట్ అవెంజర్`..`ది డార్క్ వ‌ర‌ల్డ్ `స‌హా ఎన్నో చిత్రాలు విడుద‌య్యాయి. చివ‌రిగా అవెంజ‌ర్స్ నుంచి 2019 లో `స్పైడ‌ర్ మ్యాన్: ఫార్ ప్ర‌మ్ హోమ్` రిలీజ్ అయింది. దాదాపు రెండు ఫేజ్ లుగా ర‌క‌ర‌కాల ఫ్రాంఛూజీ పేర్ల‌తో 25 కి పైగా సినిమాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ఆ చిత్రాల బిలియ‌న్ డాల‌ర్ వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టాయి.

ఇక ఫేజ్ -4 లో `బ్లాక్ విడో`..`చై అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్` రిలీజ్ అయ్యాయి. అయితే ఫేజ్ -4 లో చిత్రాలు పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. ఈ నేప‌థ్యంలో ఈ సిరీస్ కి శుభం కార్డు వేసి మార్వెల్ ఇప్పుడు కొత్త సూప‌ర్ హీరోల్ని సృష్టించిన‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌ర్ 5న దీపావ‌ళి సంద‌ర్భంగా `ఎట‌ర్న‌ల్` అనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సూప‌ర్ హీరోలు మార్వెల్ హీరోల‌కంటే చాలా శ‌క్తివంత‌మైన‌..బ‌ల‌మైన వారు అని టాక్ వినిపిస్తోంది. ఈసినిమా ట్రైల‌ర్ ఈ విష‌యాన్ని చెబుతోంది. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అంశాలతో ట్రైల‌ర్ అల‌రిస్తోంది. సూప‌ర్ హీరోల కొత్త వెర్ష‌న్ లో మునుప‌టి కంటే చాలా పాళ్లు క్రియేటివిటీ విజువ‌ల్ బ్రిలియ‌న్సీ క‌నిపిస్తోంది.

దీంతో సినిమాపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. దాదాపు 200 మిలియ‌న్ల బ‌డ్జెట్ తో ఎట‌ర్న‌ల్స్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న లాస్ ఎంజెల్స్ లో రిలీజ్ అయింది. కానీ యునైటెడ్ స్టేట్స్ స‌హా వ‌ల‌ర్డ్ వైడ్ న‌వంబ‌ర్ 5న రిలీజ్ అవుతుంది. ఇండియా లోనూ..తెలుగులోనూ కూడా ఈ బ‌చిత్రం భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ప్ర‌స్తుతం రిలీజ్ అవుతోన్న చిత్రం స‌హా భ‌విష్య‌త్లో వ‌చ్చే చిత్రాల్ని ఫేజ్ -5 జాబితాలో చేర్చిన‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News