కాజల్ కు పిల్లలు పుట్టాకే.. సినిమా రిలీజ్ పై మంచు విష్ణు!
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మోసగాళ్లు'. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ నెల 19న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవల వైభవంగా నిర్వహించారు.
అయితే.. ఈ సినిమాలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఉంది. ఇప్పటి వరకూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన కాజల్.. ఈ మూవీలో విష్ణు సోదరిగా నటిస్తోంది. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కాజల్ కూడా పాల్గొంది. పెళ్లి తర్వాత ఆమె వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ ఈల వేసి గోల చేశారు.
కాగా.. ఈ సందర్భంగా స్టేజ్ పై ఇంట్రస్టింగ్ డిస్కషన్ నడిచింది. హీరో విష్ణుతోపాటు నవదీప్ కూడా కాజల్ పై పంచులు పేల్చారు. 'ఈ సినిమాలో కాజల్ నాకు అక్క కాదు'అంటూ వ్యాఖ్యానించిన నవదీప్.. ఆర్య-3 మూవీ ప్లాన్ చేయాలని, అందులో హీరోగా కాజల్ భర్త ఉంటే బాగుంటుందని అన్నాడు.
ఇక, విష్ణు.. సినిమా గురించి, కాజల్ గురించి మాట్లాడుతూ.. తమ సినిమా ప్రారంభంలో కాజల్ పెళ్లికాకుండా సింగిల్ గా ఉందని, ఆ తర్వాత పెళ్లైపోయిందని అన్నాడు. ఈ లోగా లాక్ డౌన్ వచ్చేసి థియేటర్లన్నీ మూతపడ్డాయని చెప్పాడు. కరోనా తగ్గబట్టి థియేటర్స్ ఓపెన్ అయ్యాయిగానీ.. లేదంటే కాజల్ కు పిల్లలు పుట్టిన తర్వాతే సినిమా విడుదలయ్యేదేమోనని చమత్కరించాడు. దీంతో.. అక్కడున్నవాళ్లంతా నవ్వేశారు.
దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టితోపాటు నవదీప్, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏవీఏ ఎంటర్ టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై విష్ణు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.