మొన్న మోహన్ బాబు.. ఇప్పుడు విష్ణు
కరోనా మహమ్మారితో డాక్టర్లు.. పోలీసులు.. పారిశుద్ద కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న విషయం తెల్సిందే. కరోనా పేరు వింటేనే జనాలు భయపడి పోతూ ఉంటే డాక్టర్లు మాత్రం కరోనా పేషంట్స్ కు చికిత్స అందిస్తున్నారు. వారు తమ ప్రాణాలనే పనంగా పెడుతున్నారు. ఈ సమయంలో వైధ్య సిబ్బంది చేస్తున్న సేవకు సెల్యూట్ చేయాల్సిందే. అలాంటిది వారిపై కొన్ని చోట్ల దాడి జరగడం దారుణం అంటూ మోహన్ బాబు ఇటీవల ఒక వీడియోను విడుదల చేశాడు.
డాక్టర్లపై జరిగిన దాడిని తప్పుబట్టిన మోహన్ బాబు వారు చేస్తున్న గొప్ప సేవను కొనియాడారు. ఈ సమయంలో వారు రియల్ హీరోలు అన్నట్లుగా కీర్తించాడు. తండ్రి తర్వాత తనయుడు మంచు విష్ణు కూడా వైధ్య సిబ్బంది పోలీసులు ఇంకా పారిశుద్ద కార్మికులపై ప్రశంసలు కురిపించారు. రియల్ హీరోలు అంటూ వైధ్య సిబ్బందిని అభినందించాడు. ప్రతి ఒక్కరు కూడా వైధ్య సిబ్బందిని గౌరవించాలి. ప్రాణాలకు తెగించి చేస్తున్న వారి సేవలు అనిర్వచనీయం అన్నాడు.
హైదరాబాద్.. చెన్నై కరోనా ఫైటర్స్ అయిన డాక్టర్స్ కు ఈ సందర్బంగా మంచు విష్ణు సెల్యూట్ చేశాడు. ఇంట్లో వారికి దూరంగా ఉంటూ వారు చేస్తున్న సేవను అభినందించాడు. ఈ సమయంలోనే డాక్టర్లు వారి వృత్తిని వారు సక్రమంగా నిర్వహిస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుందని మంచు విష్ణు అన్నాడు.
వీడియో కోసం క్లిక్ చేయండి