తిమ్మరాజుపల్లి టీవీ రిజల్ట్.. కిరణ్ అబ్బవరం మాస్టర్ ప్లాన్.. నిర్మాతగా సక్సెస్ అయ్యాడా?
ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ఒకే విభాగానికి పరిమితం అవ్వకుండా.. ఇండస్ట్రీలో ఉండే 24 ఫ్రేమ్స్ లో ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో సత్తా చాటుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు;
ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు ఒకే విభాగానికి పరిమితం అవ్వకుండా.. ఇండస్ట్రీలో ఉండే 24 ఫ్రేమ్స్ లో ఒక్కొక్కరు ఒక్కో విభాగంలో సత్తా చాటుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు దర్శకులుగా, నిర్మాతలుగా తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్న విషయం తెలిసిందే. అలా ఇప్పటికే మెగా డాటర్ నిహారిక ఒకవైపు హీరోయిన్గా సినిమాలు చేసి.. ఇప్పుడు నిర్మాతగా సక్సెస్ అయి తన సత్తా ఏంటో చాటింది. ఇప్పుడు ఈమె బాటలోనే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా నిర్మాతగా అవతరించి నిర్మించిన తొలి చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ.
తిమ్మరాజు పల్లి టీవీ మూవీతో నిర్మాతగా మారిన కిరణ్ అబ్బవరం..
కే ఏ ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి, ఈ బ్యానర్ ద్వారా సుమారుగా 25 మంది కొత్త నటీనటులతో చేసిన ప్రయోగమే తిమ్మరాజు పల్లి టీవీ. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో అసలు ఈ సినిమా ఫలితం ఏంటి? ఈ సినిమాను నిర్మించిన కిరణ్ అబ్బవరం తొలి ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా? ఈ సినిమా వల్ల కిరణ్ అబ్బవరం కు లాభమా ? నష్టమా? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తిమ్మరాజు పల్లి టీవీ మూవీ ఎలా ఉందంటే?
ప్రముఖ డైరెక్టర్ మునిరాజు కొత్త వాళ్లతో చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. టైటిల్లో చెప్పినట్టుగానే ఈ సినిమా ఒక టీవీ చుట్టూ తిరిగే పల్లెటూరి కథ. మొదటి భాగం అంతా మామూలు ప్రేమాయణం. పల్లెటూరి కామెడీతో సినిమాను ముందుకు తోయాలని చూసాడు దర్శకుడు.. మొదటి భాగం బోర్ కొట్టించినా.. అసలు మిస్టరీ ఓపెన్ అయ్యేది సెకండ్ పార్ట్ లోనే. కానీ అప్పటివరకు ఆడియన్స్ కి ఓపిక ఉండాలి కదా. మొదటి భాగమే చాలా బోరింగ్ గా అనిపించడంతో రెండవ భాగం అంతగా ఆసక్తిగా అనిపించలేదు అని అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి హీరోగా నిలిచింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ అనే చెప్పాలి.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కొన్ని సీన్లను బాగా ఎలివేట్ చేశారు. చివర్లో ఫీల్ గుడ్ నోటుతో సినిమా కథ ముగుస్తుంది. సాయి తేజ, ప్రదీప్ కొట్టే, వేద లాంటి వాళ్లు కొత్త వాళ్లు అయినా చిత్తూరు యాసలో తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే మ్యూజిక్ బాగున్నా.. అక్కడక్కడ కొన్ని సీన్లలో ఎమోషన్ మాత్రం ఆడియన్స్ కి సరిగా కనెక్ట్ అవ్వలేదు. మొత్తానికి అయితే తిమ్మరాజు పల్లి టీవీ అనేది ఒక రియలిస్టిక్ అటెంప్ట్ అనే చెప్పాలి. పల్లెటూరి డ్రామాలను ఇష్టపడే వాళ్లకు చిత్తూరు యాసను ప్రేమించే వాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది
కిరణ్ అబ్బవరం మాస్టర్ ప్లాన్ అదుర్స్.. నిర్మాతగా సక్సెస్ అయ్యాడా?
తిమ్మరాజు పల్లి టీవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా నిర్మాతగా కిరణ్ అబ్బవరం చాలా తెలివిగా చక్కగా ప్లాన్ చేశారు.. కొత్త నటీనటులు అనే ఒక గుర్తింపు రావడమే కాకుండా డిజిటల్ డీల్ ద్వారా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు థియేటర్లలో వచ్చే ప్రతి రూపాయి కూడా కిరణ్ అబ్బవరం కి లాభమే. మరి ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయం తెలియాలి అంటే వీకెండ్స్ పూర్తి కావాల్సిందే.