• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మేకోవర్ తో షాక్ ఇచ్చిన...

మేకోవర్ తో షాక్ ఇచ్చిన మంచు హీరో

By - Tupaki Desk
Update: 2019-08-28 05:51 GMT
హీరో మంచు మనోజ్ ను వరస పరాజయాలు పలకరించడంతో సినిమాలనుంచి ఒక లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు.  మనోజ్ రెగ్యులర్ గా ట్విట్టర్ లో ఏదో ఒక విషయంలో స్పందిస్తూనే ఉన్నప్పటికీ తన ఫోటోలు మాత్రం ఈమధ్య సోషల్ మీడియాలో బయటకు రాలేదు.  కొంతకాలం క్రితం తన ఫిజిక్ పై వర్క్ చేస్తున్నట్టుగా మాత్రం ఒక ట్వీట్ పెట్టాడు. అయితే తాజాగా మనోజ్ ట్విట్టర్ లో తన ప్రొఫైల్ పిక్ మార్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.

గతంలో కాస్త బొద్దుగా ఉన్న మనోజ్ ఈ ఫోటోలో స్లిమ్ గా ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఫుల్ ఫోటో కాకపోయినా మనోజ్ ఫేస్ చూస్తేనే ఆ మార్పు తెలుస్తోంది.  'వేదం' సినిమా టైమ్ లో పర్ఫెక్ట్ షేప్ లో కనిపించిన మనోజ్ మరోసారి అదే రకంగా మారినట్టు కనిపిస్తున్నాడు. ఈ న్యూ మేకోవర్ మనోజ్ తన కొత్త సినిమాకోసమేనని సమాచారం. త్వరలోనే మనోజ్ కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.  ఇది మనోజ్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక ఈ కొత్త మేకోవర్ కు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. చాలామంది ఈ కొత్త లుక్ తో సర్ ప్రైజ్ చేశావంటూ మనోజ్ ను మెక్చుకుంటున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం మరీ స్లిమ్ లుక్ వద్దని.. కాస్త బొద్దుగా ఉంటేనే బాగుంటావు మనోజ్ అన్నా అని కామెంట్ చేస్తున్నారు. మనోజ్ లాస్ట్ సినిమా 'ఒక్కడు మిగిలాడు'. ఈ చిత్రం 2017 లో రిలీజ్ అయింది.  రెండేళ్ళ గ్యాప్ తర్వాత మనోజ్ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది.  మనోజ్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని.. ప్రేక్షకులను తనదైన శైలిలో మరోసారి అలరించాలని కోరుకుందాం.

   

Tags:    
  • Manchu Manoj 
  • Latest News 
  • Movie News 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS