• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మంచు ఫ్యామిలీ ఎక్కడబ్బా?

మంచు ఫ్యామిలీ ఎక్కడబ్బా?

By - Tupaki Desk
Update: 2018-12-02 14:30 GMT
టాలీవుడ్లోని బడా ఫ్యామిలీస్‌ లో మంచు కుటుంబం ఒకటి. ఆ కుటుంబం నుంచి ఒకరిని నలుగురు ఇండస్ట్రీలో ఉన్నారు. ఒకప్పుడు మోహన్ బాబు తెలుగు సినిమాల్లో వైభవం చూశారు. హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా.. అద్భుతమైన పాత్రలతో తెలుగు సినిమాపై తనదైన ముద్ర వేశారు. కానీ మోహన్ బాబు ఘన వారసత్వాన్ని నిలబెట్డడంలో ఆయన సంతానం విఫలమైంది. మంచు విష్ణు.. మంచు మనోజ్.. మంచు లక్ష్మీప్రసన్న.. ఈ ముగ్గురూ సినీ రంగ ప్రవేశం చేశారు. వరుసబెట్టి సినిమాలు చేశారు. కానీ ఈ ముగ్గురికీ ఎక్కువగా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఐతే ఎదురు దెబ్బలు తగులుతున్నా ముగ్గురూ సినిమాలు మాత్రం మానలేదు. ఒకదాని తర్వాత ఇంకో ప్రాజెక్టు లైన్లో పెడుతూనే కనిపించారు. గతంతో పోలిస్తే సినిమాలు తగ్గించేసిన మోహన్ బాబు కూడా సొంత బేనర్లో అప్పుడప్పుడూ ఒక చిత్రం చేసేవాడు.

కానీ ఈ మధ్య మంచు ఫ్యామిలీ పూర్తిగా దూకుడు తగ్గించేసింది. టాలీవుడ్లో వీళ్ల సందడే కనిపించడం లేదు. ‘గాయత్రి’ తర్వాత మోహన్ బాబు సినిమాలే చేసే ఉద్దేశంతో కనిపించడం లేదు. ఆయన సంగతలా వదిలేస్తే ఇంతకుముందు వరుస బెట్టి సినిమాలు చేసిన మంచు విష్ణు.. మంచు మనోజ్ కూడా సైలెంటైపోయారు. మనోజ్ పూర్తిగా సినిమాలు వదిలేసి.. సేవా కార్యక్రమాల్లో బిజీ అయిపోయాడు. అతను రాజకీయాలపై దృష్టిపెడుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. మంచు విష్ణు ‘ఓటర్’ అనే సినిమా చేస్తున్నాడు కానీ.. దాని గురించి న్యూసే లేదు. అసలు ఆ సినిమా రిలీజవుతుందా లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. షూటింగ్ అప్ డేట్స్ కూడా ఏమీ ఇవ్వట్లేదు. ఇక ‘వైఫ్ ఆఫ్ రామ్’తో కంగుతిన్న మంచు లక్ష్మి కూడా కొత్తగా ఏ సినిమా చేస్తున్నట్లు లేదు. తమిళంలో మాత్రం ‘కాట్రిన్ మొళి’ అనే సినిమాలో అతిథి పాత్ర చేసింది. ఈ ముగ్గురూ సామాజిక మాధ్యమాల్లో కూడా దూకుడు తగ్గించారు. మంచు ఫ్యామిలీకి ఫెయిల్యూర్లు కొత్త కాదు. కానీ ఎప్పుడూ వాళ్లు దూకుడు తగ్గించలేదు. కానీ ఈ మధ్య ఉన్నట్లుండి అందరూ ఎందుకు సైలెంటైపోయారో మరి?


Tags:    
  • Manchu Family 
  • Telugu Film Industry 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS