మల్లు సూపర్ స్టార్‌ కూడా ప్రభాస్ ను కాదనలేక పోయాడట!

Update: 2022-06-25 09:03 GMT
ఇటీవల గోపీచంద్‌ తన సినిమా ప్రమోషన్ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ప్రభాస్ తో మంచి స్నేహం ఉంది. స్నేహం కంటే కూడా ముఖ్యంగా ఆయనతో సినిమా ను చేయడాన్ని ఆస్వాదిస్తాను. ఒకవేళ ప్రభాస్ అడగాలే కాని ఏ పాత్రకు అయినా డేట్లు లేవు.. కాదు అనకుండా ఇచ్చేందుకు సిద్దం. పాత్ర ఏదైనా కూడా నటించేందుకు సిద్ధం అన్నట్లుగా చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

ప్రభాస్ కు మరియు గోపీచంద్‌ కు మద్య ఉన్న స్నేహం అలాంటిది అని చాలా మంది అనుకున్నారు.. అనుకుంటున్నారు. కేవలం గోపీచంద్‌ కు మాత్రమే కాకుండా ప్రభాస్ అంటే పాన్ ఇండియా రేంజ్ లో అంతా కూడా అలాగే అభిమానంతో.. ఆయన అడిగితే నో చెప్పలేనంత ప్రేమతో ఉన్నారు అని తాజాగా మలయాళ సూపర్ స్టార్‌ పృథ్వీరాజ్‌ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

మలయాళ సూపర్ స్టార్‌ పృథ్వీరాజ్ సుకుమారన్‌ తాజా చిత్రం కడువ విడుదలకు సిద్దం అయ్యింది. పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాను విడుదల చేయడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సినిమా ప్రమోషన్‌ కోసం దక్షిణ భారతంలోని అన్ని ముఖ్య నగరాల్లో పృథ్వీరాజ్ పర్యటించబోతున్నాడు. తాజాగా ఒక కార్యక్రమంలో ప్రభాస్ గురించి పృథ్వీరాజ్ స్పందించాడు.

ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా లో మొదట నటించను అని.. ఆ తర్వాత నటించేందుకు ఒప్పుకోవడం కు కారణం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో ఆయన స్పందిస్తూ... సలార్‌ సినిమా ప్రారంభం కాకముందే ఆఫర్‌ నా వద్దకు వచ్చింది. ఆ సమయంలో కరోనా పరిస్థితులు ఉన్నాయి. డేట్లు ఇవ్వడం.. డేట్స్ సర్దుబాటు చేయడం చాలా సమస్యగా ఉండేది. దాంతో సలార్ ను తిరష్కరించాను.

కరోనా ఇతర కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. ఆ తర్వాత మరోసారి ప్రభాస్ నన్ను సలార్ లో నటించాల్సిందిగా కోరాడు. అప్పుడు నేను ప్రభాస్ కు నో చెప్పలేక పోయాను. ప్రభాస్ అడగడంతో పూర్తిగా కథ కూడా వినకుండానే ఓకే చెప్పేశాను అన్నట్లుగా పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. సినిమా లో తన పాత్ర గురించి పృథ్వీరాజ్ స్పందించాడు.

సినిమా కథ.. స్క్రీప్ట్‌ నాకు తెలుసు. సినిమా ను ఒక అద్భుతంగా దర్శకుడు తీస్తున్నాడు. ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా గా.. కమర్షియల్‌ సినిమా గా నిలుస్తుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. ఇందులో నటిస్తున్న నాకే ఈ సినిమాను థియేటర్‌ లో ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నట్లుగా ఉందంటూ పృథ్వీరాజ్‌ సుకుమార్ చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News