ఆ శృంగార సన్నివేశాలు చేసేటప్పుడు చచ్చినంత పనైంది: మల్లికా శెరావత్
బాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ మల్లికా షెరావత్.. గురించి గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె చేసిన బోల్డ్ రోల్స్ ద్వారా మంచి పాపులారిటి దక్కించుకుంది. అయితే కెరీర్ ప్రారంభంలోనే అమ్మడు ఓ రేంజిలో బికినీ షో - శృతిమించిన శృంగారం సన్నివేశాలు చేసి బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా మల్లికా తన సినిమాల గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శృంగార సన్నివేశాలలో నటించేటప్పుడు ఎదురైన చేదు అనుభవాలు బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలోనే మల్లికా క్వాహిష్(2003) మర్డర్(2004) సినిమాలు చేసి మోస్ట్ సెక్సీ యాక్ట్రెస్ గా ముద్ర వేసుకుంది.
ముఖ్యంగా మర్డర్ సినిమాలో శృంగార సన్నివేశాల్లో నటించే సమయంలో తాను నైతికంగా చనిపోయానని.. ఓ విధంగా హత్యకు గురైనట్లుగా అనిపించిందని చెబుతోంది. అలాగే ఆ సన్నివేశాలకు మించిన విమర్శలు నాపై నాకే తక్కువ అనిపించేలా చేశాయని వాపోయింది. 2003లో మల్లికా ఖ్వాహిష్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత వెంటనే మర్డర్ మూవీలో నటించింది. ఈ రెండు చిత్రాలు బోల్డ్ సన్నివేశాలతోనే పాపులర్ అయ్యాయి. అంతేగాక మల్లికా పై బోల్డ్ సింబల్ వేసాయి. తాజాగా మల్లికా ఓ పాపులర్ దినపత్రికతో మాట్లాడుతూ.. “నేను మర్డర్ (2004)లో నటించిన బోల్డ్ సన్నివేశాలతో దాదాపు నైతికంగా హత్య చేయబడ్డాను.
ఆ క్యారెక్టర్ నన్ను దిగజారెలా చూపించింది. కానీ నేను అప్పుడు చేసిన సన్నివేశాలు ఇప్పుడు సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. ప్రజల దృష్టి కూడా మారిపోయింది. కానీ ఇప్పుడు కూడా నాకు 50 - 60ల సినిమాలే ఇష్టం. వాటిని ఎవరూ బీట్ చేయలేరు. అప్పట్లో మహిళా ప్రాధాన్యత పాత్రలు గొప్పగా ఉండేవి. కానీ ఆ అందం ఇప్పుడు సినిమాల్లో లేదు. ఇప్పుడు అలాంటి పాత్రలు దొరకటం చాలా కష్టం.' అంటోంది బోల్డ్ బ్యూటీ. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మర్డర్‌లో మల్లికా సిమ్రాన్ పాత్రలో నటించింది. ఇమ్రాన్ హష్మీతో మల్లికా అక్రమసంబంధం పెట్టుకునే సన్నివేశాలు అప్పట్లో హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం అమ్మడు పలు వెబ్ సీరిస్ లతో పాటుగా వెబ్ షోలలో నటిస్తుందట.